సింహ రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు?       2018-06-13   01:13:53  IST  Raghu V

సింహ రాశి వారు వారి జీవిత భాగస్వామితో ఏ విధంగా ఉంటారు. అసలు వారి ప్రవర్తన,ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సింహ రాశి వారిని జీవిత భాగస్వామిగా చేసుకోవటం అదృష్టంగా చెప్పవచ్చు. మిగతా రాశులతో పోలిస్తే సింహ రాశివారు గొప్ప ప్రేమికులు. ప్రేమించిన వారి కోసం ఏమి చేయటానికి అయినా సిద్ధపడతారు. అంతేకాక వీరి కోసం ఏ త్యాగం అయినా చేస్తారు. అలాగే ఎంతటి కష్టాన్ని అయినా అనుభవించటానికి సిద్ధంగా ఉంటారు.

-

జీవిత భాగస్వామికి ఏదైనా సమస్య వస్తే చాలా సపోర్ట్ గా ఉంటారు. వీరికి జీవిత భాగస్వామి పట్ల విపరీతమైన నమ్మకం ఉంటుంది. వీరికి సర్దుకుపోయే తత్త్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇష్టపడిన వ్యక్తి కోసం ఎంతైనా సర్డుబాటు చేసుకోవటానికి రెడీగా ఉంటారు. సింహ రాశి వారి మీద వంద శాతం ప్రేమను చూపితే వారు 300 శాతం ప్రేమను చూపిస్తారు.

సింహ రాశి వారు తమ జీవిత భాగస్వామి కోరిన ఏ కోరికను అయినా తీర్చటానికి సిద్ధంగా ఉంటారు. ఎంత ఖర్చు అయినా,ఎంత కష్టమైన వెనకడుగు వేయరు. అలాగే వీరికి విపరీతమైన కోపం ఉంటుంది.వీరు చేసే పనిని గుర్తించకపోతే మాత్రం కోపం వస్తుంది. ఒక్కసారి కోపం వస్తే తగ్గించటం ఎవరి తరం కాదు. అందువల్ల సింహ రాశి వారిని జీవిత భాగస్వామిగా పొందిన వారు వారు చేసిన పనిని గుర్తించాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.