మరో పాపను పట్టేసిన తమిళ మన్మధుడు  

Simbu Affair With Another Heroine - Telugu Hansika, Kollywood Movie News, Nayanthara, Simbu, Subhiksha, Trisha

తమిళంలో శింబు తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని హీరోగా తన సత్తా చాటుకున్నాడు.యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా శింబు అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్‌ను సాధించాడు.

Simbu Affair With Another Heroine - Telugu Hansika Kollywood Movie News Nayanthara Subhiksha Trisha

కాగా ఇటీవల కాలంలో సరైన హిట్స్ లేక శింబు చాలా వెనుకబడిపోయాడు.అంతేగాక తన వ్కక్తిగత జీవితంలో అనేక వివాదాలతో సతమతమైన శింబు ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టాడు.

కాగా కోలీవుడ్‌లో అనేక లవ్ స్టోరీలు నడిపిన హీరోగా కూడా శింబు పేరు తెచ్చుకున్నాడు.గతంలో నయనతారతో పీకల్లోతు ప్రేమలో మునిగిన శింబు ఆ రిలేషన్‌కు బ్రేకప్ చెప్పాడు.

ఆ తరువాత మరో బ్యూటీ హన్సికతో వీరలెవెల్‌లో ప్రేమాయణం సాగించిన ఈ తమిళ మన్మధుడు ఆమెతో కూడా తెగతెంపులు చేసుకున్నాడు.అయితే ఇప్పుడు మరో కొత్త హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడట ఈ హీరో.

కోలీవుడ్‌లో ‘అన్నకొడి’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సుభిక్షతో శింబు సరికొత్త లవ్‌స్టోరీని మెదలుపెట్టాడట.ఆమెతో అనేక చోట్లకు చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడట ఈ హీరో.

ఇటీవల శింబు తండ్రి రాజేందర్ తన కొడుకుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నానని వెల్లడించిన సంగతి తెలిసిందే.కాగా ఇప్పుడు సుభిక్షతో శింబు తిరుగుతుండటంతో ఆమెను అతడు పెళ్లాడబోతున్నాడా అనే సందేహం అందరిలో మొదలైంది.

తాజా వార్తలు