బిగ్ బాస్ లో హోస్ట్ గా వ్యవహరించనున్న ఆ మాస్ హీరో...

బిగ్ బాస్ షో అనేది దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో విపరీతంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది.మొదటగా బాలీవుడ్ లో ఈ షో ను ప్రయోగత్మకంగా పరిశీలించడం కోసం మొదటి సీజన్ ను ప్రారంభించారు.

 The Mass Hero Simbu Who Will Be The Host In Tamil Bigg Boss , Tamil Hero Simbu,-TeluguStop.com

అయితే మొదటి షో కే అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఇక తరువాత మిగతా భాషలైన తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో ఈ షో ప్రసారమవుతోంది.ఈ షో ప్రత్యేకత ఏమనగా ఇండస్ట్రీలో ఉండే సూపర్ స్టార్ ఈ షోకు వ్యాఖ్యతగా ఉండడం ఒక కారణమైతే, తమ అభిమాన సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాన్ని వీక్షించే అవకాశం ఉండడంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా బిగ్ బాస్ కు ఒక విధంగా వ్యసనమైపోయారంటే ఎంతగా బిగ్ బాస్ ప్రజల్లోకి వెళ్లిందో మనం అర్థం చేసుకోవచ్చు.

అయితే తమిళ బిగ్ బాస్ పై ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.తమిళ బిగ్ బాస్ ను కమలహాసన్ హోస్ట్ చేస్తారనే విషయం మనకు తెలిసిందే.

అయితే ఇప్పుడు తాను ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పరిస్థితులలోఅదే విధంగా బిగ్ బాస్ యాజమాన్యం కూడా తమిళ బిగ్ బాస్ టెలికాస్ట్ కు ప్రయత్నాలు ప్రారంభిస్తున్న తరుణంలో కమల్ హాసన్ అందుబాటులో లేకపోవడంతో తమిళ మాస్ హీరో శింభును బిగ్ బాస్ హోస్ట్ గా కొనసాగించాలని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.ఈ వార్తల్లో ఉన్న నిజం ఎంతో తెలియాలంటే మనం మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube