లాక్ డౌన్'లో 30 కేజీలు తగ్గిన స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

Simbu Sister Praises Him Works Hard Over Physical Transforamation Shimbu, Ilakiya Abhilash, Eswaran, Dhindigal, Shimbhu 30 Kg's Waight Loss, Social Media, Shimbhu Sister

కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రపంచ దేశాలు తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ ను అమలు చేసిన సంగతి తెలిసిందే.అయితే లాక్ డౌన్ వల్ల సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

 Simbu Sister Praises Him Works Hard Over Physical Transforamation Shimbu, Ilaki-TeluguStop.com

వ్యాపార రంగంపై ఆధారపడ్డవాళ్లు తీవ్రంగా నష్టపోయారు.అయితే లాక్ డౌన్ వల్ల అందరూ నష్టపోయినా కొంతమందికి మాత్రం మంచే జరిగింది.

స్టార్ హీరో శింబు లాక్ డౌన్ సమయంలో ఏకంగా 30 కేజీలు తగ్గాడు.

లాక్ డౌన్ కు ముందు కొంచెం లావుగా ఉన్న శింబు సరైన ప్రణాళికతో వర్కౌట్లు చేసి బరువు తగ్గారని సమాచారం.

శింబు బరువు తగ్గడంతో ఆయన లుక్ పూర్తిగా మారిపోయింది.వరుస షూటింగ్ ల వల్ల ఫిట్ నెస్ పై పెద్దగా దృష్టి పెట్టని శింబుకు లాక్ డౌన్ వల్ల ఖాళీ సమయం దొరికింది.

శింబు సోదరి ఇలకియా అభిలాష్ శింబు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇలకియా ట్వీట్ లో బరువు తగ్గించుకోవడం కోసం శింబు ఎంతో కష్టపడ్డారని.

శింబు కష్టాన్ని కేవలం బరువు తగ్గడనే కోణంలో మాత్రమే చూడవద్దని.శింబు అసలైన శక్తిని, లక్ష్యాలను తెలుసుకునే మార్గమని పేర్కొన్నారు.

బరువు తగ్గే సమయంలో లక్ష్యాన్ని చేరుకోవడం కోసం పడిన కష్టాన్ని తాను కళ్లారా చూశానని పేర్కొన్నారు.శింబు సంకల్ప బలం ఎంతో గొప్పదని ఇలకియా పేర్కొన్నారు.

బరువు తగ్గడం గురించి శింబు స్పందిస్తూ సరోన్నత శక్తి తాను బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడిందని.అభిమానుల ప్రేమే తనకు ప్రపంచమని.అభిమానులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని చెబుతూ శింబు అభిమానులకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.ప్రస్తుతం శింబు ఈశ్వరన్, దిండిగల్ ఈ సినిమాలో నటిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube