శింబు మానాడు తెలుగు రీమేక్ లో మెగా హీరో..!

Simbu Manadu Telugu Remake Sai Dharam Tej Hero

కోలీవుడ్ హీరో శింబు హీరోగా వెంకట్ ప్రభు డైరక్షన్ లో వచ్చిన సినిమా మానాడు.తమిళంలో ఈమధ్యనే రిలీజై సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా తెలుగులో ది లూప్ పేరుతో రిలీజ్ చేయాలని అనుకున్నారు.

 Simbu Manadu Telugu Remake Sai Dharam Tej Hero-TeluguStop.com

డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేశాక ఎందుకో ఈ సినిమా రిలీజ్ వాయిదా వేశారు.అయితే ప్రస్తుతం మానాడు తెలుగు వర్షన్ రిలీజ్ చేయకుండా ఆ సినిమా తెలుగు రీమేక్ చేయాలని చూస్తున్నారట.

ఆల్రెడీ తెలుగు బడా నిర్మాత ఒకరు ఈ సినిమా రైట్స్ కొన్నారని తెలుస్తుంది.

 Simbu Manadu Telugu Remake Sai Dharam Tej Hero-శింబు మానాడు తెలుగు రీమేక్ లో మెగా హీరో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం మెగా హీరో సాయి ధరం తేజ్ ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

రిపబ్లిక్ తర్వాత సుకుమార్ అసిస్టెంట్ కార్తిక్ డైరక్షన్ లో సాయి ధరం తేజ్ ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత మానాడు రీమేక్ ఉండే ఛాన్స్ ఉంది.

ఈమధ్యనే బైక్ యాక్సిడెంట్ నుండి కోలుకున్న సాయి తేజ్ 2022 లో తన నెక్స్ట్ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటాడని తెలుస్తుంది.శింబు సినిమా అక్కడ సూపర్ హిట్ కాగా తెలుగులో సాయి ధరం తేజ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

#Sai Dharam Tej #Simbu #Sai Tej

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube