ఫస్ట్ లుక్ తో షాక్ ఇచ్చిన శింబు..!

కొన్ని క్రేజీ కాంబినేషన్స్ లో సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి.మేకర్స్ కూడా ఆ అంచనాలకు తగినట్టుగానే సినిమాను చేస్తారు.

 Simbu Gautham Menon Movie Str47 Vendhu Thaninandu Kaadu First Look , Gautham Men-TeluguStop.com

కోలీవుడ్ లో గౌతం వాసుదేవ మీనన్, శింబు కాంబినేషన్ అంటే సూపర్ క్రేజ్.శింబుతో విన్నై తాండి వరువాయా తో పాటుగా అచ్చం యెంబదు మడమైదా సినిమాతో కూడా డబుల్ హిట్ ఇచ్చాడు గౌతం మీనన్.

ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు.ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ కూడా రివీల్ చేశారు.

వెందు తనిందతు కాడు అనే టైటిల్ తో ఈ సినిమా వస్తుంది.సినిమాను వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో ఇషారి కె గణేష్ నిర్మిస్తున్నారు.

సినిమా ఫస్ట్ లుక్ లో వెనక అగ్నికి ఆహుతైన అడవిగా ఉండగా చిరిగిన చిక్కా, లుంగీతో చేతిలో కర్రతో శింబు కనిపించాడు.

శింబు కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.

ఈ ఫస్ట్ లుక్ తో శింబు షాక్ ఇచ్చాడని చెప్పొచ్చు.శింబు, గౌతం మీనన్ కాంబోకి తగినట్టుగానే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఉంది.

సినిమాలో శింబు లుక్ తోనే సగం మార్కులు కొట్టేశాడు.ఇక సినిమా కాన్సెప్ట్, గౌతం మీనన్ డైరక్షన్ ఇవి కూడా సినిమాలో మేజర్ హైలెట్ అయ్యేలా ఉన్నాయని తెలుస్తుంది.

మరి ఫస్ట్ లుక్ తో అదరగొట్టిన ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube