ఖరీదైన గిఫ్ట్ హీరో శింబు.. ఆ సక్సెస్ నే కారణమా..

కోలీవుడ్ స్టార్ హీరోల్లో శింబు ఒకరు.ఈయన అప్పట్లో వరుస ప్రేమ కథలు చేసి యువతను మెప్పించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.

 Simbu And Gautham Menon Get Costly Gifts From Ishari Ganesh, Simbu, Gvm, Arr, Je-TeluguStop.com

అయితే ఈయన గత కొంత కాలంగా హిట్ సినిమాలు లేక కెరీర్ డల్ అయ్యింది.ఈయన ఏ సినిమా చేసిన వరుస ప్లాప్స్ నే ఎదురయ్యాయి.

దీంతో ఈయన కెరీర్ దాదాపు ముగిసి పోయింది అనే రూమర్స్ కూడా వచ్చాయి.

 Simbu And Gautham Menon Get Costly Gifts From Ishari Ganesh, Simbu, GVM, ARR, Je-TeluguStop.com

అయితే ఇప్పుడు ‘మానాడు’, లైఫ్ ఆఫ్ ముత్తు సినిమాలతో మరోసారి ఫామ్ లోకి వచ్చాడు.

ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో చాలా సక్సెస్ ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ సినిమా ఇచ్చిన సూపర్ హిట్ విజయాన్ని ఇప్పుడు మరింత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.ఈ విజయం ఇచ్చిన ఆనందంలో భారీ ఖరీదైన గిఫ్ట్ కూడా అందుకున్నాడు.

ది లైఫ్ ఆఫ్ ముత్తు సినిమాను దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించాడు.ఈ సినిమా అక్కడ కోలీవుడ్ లో సంచలన విజయం సాధించడంతో ఈ టీమ్ అంతా చాలా ఆనందంగా ఉన్నారు.

ఈ సినిమా నిర్మాత ఈశారి కె గణేష్ భారీ సక్సెస్ రావడంతో హీరోకు, దర్శకుడికి ఖరీదైన గిఫ్టులు ఇచ్చినట్టు సమాచారం.ఈయన హీరో శింబుకు ఒక ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చి ఆయనను సుర్ప్రైజ్ చేశారట.

అలాగే డైరెక్టర్ గౌతమ్ మీనన్ కు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను బహుమతిగా ఇచ్చారట.ప్రెజెంట్ కోలీవుడ్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.వీటికి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.ఇక ది లైఫ్ ఆఫ్ ముత్తు సినిమాకు జయ మోహన్ కథ అందించగా.ఈ సినిమాలో శింబుకు జోడీగా సిద్ధి ఇధ్నానీ హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాకు ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube