ఏపీలో వైసీపీ+కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్‌

ఏపీలో అధికార టీడీపీని, సీఎం చంద్రబాబును ఎదుర్కొనేందుకు త‌ల్లి కాంగ్రెస్ అయిన కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్ అయిన వైసీపీ ఇంట‌ర్న‌ల్‌గా ఒక్క‌ట‌వుతున్నాయా ? వీటి మ‌ధ్య ఇప్ప‌టికే ఈ విష‌యంలో అండ‌ర్ స్టాండింగ్ కుదిరిందా ? ఏపీలో ప‌త‌నావ‌స్థ‌లో ఉన్న కాంగ్రెస్‌, వైసీపీకి స‌పోర్ట్ చేసేందుకు సిద్ధ‌మైందా ? అంటే అవున‌నే ఆన్స‌ర్లు ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల ద్వారా తెలుస్తోంది.

 Silpa Mohan Reddy To Contest In Nandyal Elections-TeluguStop.com

ఇటీవ‌ల వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డికి జ‌గ‌న్ నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు వైసీపీ సీటు ఇచ్చారు.

ఆయ‌న పార్టీ మారే ముందు కాంగ్రెస్ పార్టీ రాజ్య‌సభ స‌భ్యుడు కెవిపి.రాంచంద్ర‌రావును క‌లిశారు.

వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన లంచ్ మీట్‌లో కేవిపి శిల్పాకు ప‌లు స‌ల‌హాలు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఇక ర‌ఘువీరా ప‌దే ప‌దే జ‌గ‌న్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఈ విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా ఆయ‌న చేత‌లు కూడా అలాగే క‌నిపిస్తున్నాయి.ఏపీలో 2014 సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత మొత్తం మూడు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి.

ఆళ్ల‌గ‌డ్డ‌(శోభా నాగిరెడ్డి మృతితో), నందిగామ‌(తంగిరాల ప్రభాకర్ మృతితో), తిరుపతి(ఎమ్మెల్యే వెంకటరమణ) మృతితో ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి.

ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి శోభా నాగిరెడ్డి మృతి చెందిన ఆళ్ల‌గ‌డ్డ‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థిని ర‌ఘువీరా పోటీ పెట్ట‌లేదు.

ఇక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మృతిచెందిన నందిగామ‌, తిరుప‌తిలో మాత్రం కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను ర‌ఘువీరా నిల‌బెట్టారు.ఇప్పుడు నంద్యాల‌లో వైసీపీ కూడా పోటీ చేస్తోంది.

వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించేలా కాంగ్రెస్ అభ్య‌ర్థిని పోటీ పెట్ట‌కుండా ఉండాలా ? లేదా నామ్ కే వాస్తేగా బ‌ల‌హీన అభ్య‌ర్థిని నిల‌బెట్టి వైసీపీకి తెర‌వెన‌క స‌పోర్ట్ చేయాలా ? అన్న అంశంపై ర‌ఘువీరా, కెవిపి ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

కెవిపి డైరెక్ష‌న్‌లోనే రఘువీరా, అటు వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ది తేలిపోయింది.

దీనిని బ‌ట్టి ఏపీలో ఈ త‌ల్లి పిల్లా కాంగ్రెస్‌ల బంధం కంటిన్యూ అవుతూనే ఉంది.ఇక నంద్యాల‌లోనే కాక ఏపీ వ్యాప్తంగా కూడా ఈ రెండు పార్టీల ఫిక్సింగ్ తేట‌తెల్ల‌మ‌వుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube