సైలెంట్ అయిన హుజూరాబాద్‌.. అస‌లేం జ‌రుగుతోంది..?

మొన్న‌టి వ‌ర‌కు అంతా దాని గురించే చ‌ర్చ ఏ పార్టీని క‌దిలించినా దాని గురించే వ్యూహాలు ఏ రాజ‌కీయ నేత‌లు క‌లిసినా దానిపైనే>మ‌ల్ల‌గుల్లాలు స‌భ‌లు, స‌మావేశాలుపార్టీల్లో చేరిక‌లు బుజ్జిగింపులు ప్ర‌చారాలు పాద‌యాత్ర‌లుఎటుచూసినా తెలంగాణ మొత్తం రాజ‌కీయం హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతోంది.అయితే ఇదంతా చేస్తోంది టీఆర్ ఎస్‌, బీజేపీ మాత్ర‌మే.

 Silent Huzurabad .. What Is Actually Happening ..?,  Huzurabad, Ts Politics , Et-TeluguStop.com

కాంగ్రెస్ ఇంకా బ‌రిలో కూడా నిల‌వ‌క‌పోవ‌డంతో ఆ రెండు పార్టీల‌దే హ‌వా మొత్తం కొన‌సాగుతోంది.ఎలాగైనా గెలిచి త‌న పంతాన్ని నిరూపించుకోవాలి ఈట‌ల రాజేంద‌ర్ ఎంత‌లా ప్ర‌చారం చేస్తున్నారో చూస్తున్నాం.

ఇంకోవైపు ఈట‌లరాజంద‌ర్ ను ఓడించాల‌ని మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను త‌న భుజాల‌పై వేసుకుని ఎంత‌లా హ‌డావుడి చేస్తున్నారో చూశాం.అయితే ఇదంతా మొన్నటి వ‌ర‌కు.

కానీ ఏమైందో ఏమో తెలియ‌దు గానీ రెండు రోజులుగా ఇక్కడ మైకులు సైలెంట్ అయిపోయాయి.రెండు పార్టీల నేత‌లు ప్రచార జోరు తగ్గించేశారు.

ఇంకోవైపు కీల‌కంగా ప‌నిచేసిన మంత్రి హరీష్ రావు హైదరాబాద్‌లోనే ఉంటూ త‌న ప‌నులు చూస‌కుంటున్నారు.ఇక మొన్న‌టి వ‌ర‌కు కారు ప్ర‌చారంతో హోరెత్తించిన వారు కూడా ప్రచారం తగ్గించారు.

Telugu Etala Rajendher, Harish Rao, Huzurabad, Revanth Reddy, Trs, Ts Cingress,

ఈటల రాజేంద‌ర్ కూడా పాద‌యాత్ర‌కు మ‌ధ్య‌లోనే బ్రేక్ వేసేసి మోకాలికి గాయం అయిందంటూ సైలెంట్ అయ‌పోయారు.ఇంకా చెప్పాలంటే ఆయ‌న రెండు రోజులుగా కిష‌న్‌రెడ్డి ఆశీర్వాద యాత్ర లోనే పాల్గొంటున్నారు.ఇక ఆయన సతీమణి జ‌మున కూడా పెద్ద‌గా ప్ర‌చారంలో పాల్గొన‌ట్లేదు.దీంతో హుజూరాబాద్ కాస్తా సైలెంట్ అయిపోయింది.అయితే ఇదంతా ఇలా ఎందుకు జ‌రిగిందంటే కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ ఇప్ప‌ట్లో ఇచ్చేలా క‌నిపించట్లేదు.దీంతో వారంతా కూడా ఇప్పుడెందుకులే అన్న‌ట్టు సైలెంట్ అయిపోయారు.

ఇప్ప‌టికే ఉప ఎన్నిక అయిపోయినంత ప‌ని చేశారు అంతా కూడా.కానీ ఇప్పుడేమో సైలెంట్ అయిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube