కేసీఆర్ మౌనం వెనుక జగన్ ? అందుకేనా ఇదంతా !

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని బలంగా కోరుకుంటున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అందరికి తెలుసు.ఏపీ ఎన్నికల సందర్భంగా జగన్ ఎన్ని రకాల సహాయ సహకారాలు చేయాలో అన్ని రకాలుగా సహాయపడ్డాడు.

 Silence Behind Kcr Silence Is Jagan-TeluguStop.com

ఒకరకంగా చెప్పాలంటే ఏపీలో వైసీపీకి ఇంత మైలేజ్ రావడానికి కూడా కేసీఆర్ కారణం అయ్యాడు.టీడీపీలో కీలక నాయకులు అనుకున్న వారందిరిని వైసీపీ వైపు వెళ్లేలా టీఆర్ఎస్ అధినేత గట్టిగా కృషి చేశాడు.

కేసీఆర్ సహాయంపై టీడీపీ అధినేత ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదు.ఏదైతేనేమి ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి.

ఇప్పుడు ఫలితాల కోసమే అంతా వెయిటింగ్.కానీ ఈ సమయంలో ఏపీ రాజకీయాలు తమకు సంబంధమే లేనట్టుగా టీఆర్ఎస్ అధినేత వ్యవహరిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు పని అయిపోయిందని ఆయన ఓటమి ఖాయమని అన్నారు.దీనికి సంబంధించిన తన దగ్గర సర్వే రిపోర్ట్స్ కూడా ఉన్నాయని చెప్పారు.

ఇప్పుడు మాత్రం మౌనం తప్ప అటు నుంచి నో రెస్పాన్స్.ఏపీలో ప్రజలు ఎవరిని కోరుకుంటే వారే గెలుస్తారంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేసి ఊరుకున్నారు.

అయితే వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించకపోవడం వెనుక అసలు కారణం మాత్రం వేరే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయ్యింది.గత ఎన్నికలు పూర్తవగానే తెలంగాణలో అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్ ఏపీలో వైసీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.

కాకపోతే ఫలితాలు తారుమారయ్యాయి.

-Telugu Political News

అందుకే ఇప్పుడు ఏపీ ఎన్నికలపై ఎవరూ నోరు మెదపడంలేదు.గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి ఏపీ ఎన్నికల ఫలితాలపై ముందస్తుగా ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికైనా కేసీఆర్ సంకోచిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.ఎలాగూ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మాట్లాడటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని కేసీఆర్ ఆలోచన చేస్తున్నాడట.

ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తరువాత తమ స్పందన తెలియజేస్తే బాగుంటుందని అప్పటివరకు వేచి చూద్దామని కేసీఆర్ భావిస్తున్నాడని పార్టీలో టాక్ నడుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube