అక్కడ ఆ వాటర్ దొరకదు..ప్యాకేజ్ డ్ వాటర్ బంద్...!?

నేటి సమాజంలో ఎక్కడ చూసినా కల్తీ పదార్థాలు దర్శనమిస్తున్నాయి.కల్తీ ఆహార పదార్థాలు వినియోగించడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.

 Sikkim Government Ban Of Packaged Drinking Water, Packed Water, Viral Latest, Ne-TeluguStop.com

అందుకే ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి.తాజాగా సిక్కిం సర్కార్ కూడా తాగే నీళ్లపై ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

సహజంగా దొరికే నాణ్యతతో కూడిన తాగు నీరును ప్యాకేజ్‌డ్ బాటిల్స్‌లో చాలా మంది నిల్వ చేస్తుంటారు.వాటిని బాటిల్స్ ద్వారా అమ్ముతుంటారు.

ఇలా నిల్వ చేయడాన్ని సిక్కిం సర్కార్ నిషేధం విధించింది.సిక్కిం ముఖ్యమంత్రి పీఎస్ తమంగ్ ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు.

జనవరి 1, 2022 నుంచి ప్లాస్టిక్ బాటిళ్లలో స్టోరేజ్ చేసే నీటిని వాడకూడదని నిషేధం విధించారు.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

గాంధీ జయంతి సందర్భంగా సీఎం ఓ కార్యక్రమంలో మాట్లాడారు.ఆ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నేచురల్ రిసోర్సుల నుంచి సేకరించిన నీటితో ఆరోగ్యంగా జీవించాలని తెలిపారు.

సిక్కిం ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా బాటిల్స్ లో ఉండే మినరల్ వాటర్ ను తాగకూడదని అన్నారు.

సహజ నీటిని తాగుతూ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.

ఈ ప్రతిపాదనను అమలు చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు.కాబట్టి మూడు నెలల్లోగా దీనికి సంబంధించిన అన్ని విషయాలు పూర్తయ్యేలా చేయాలని, ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

Telugu Ban Packaged, Latest, Natural Pure, Packed, Sikkimcm, Sikkim-Latest News

గవర్నర్ గంగా ప్రసాద్ తో పాటు క్లీన్‌లీనెస్ డ్రైవ్ లో పాల్గొన్న తమంగ్ నీటి గురించి, అది మన ఆరోగ్యంపై చూపే విధానం గురించి మాట్లాడారు.బయట ప్రాంతాల నుంచి సరఫరా అయ్యే ప్యాకేజ్ డ్ డ్రింకింగ్ వాటర్ ను రాష్ట్ర సర్కార్ నిలిపివేయడం చాలా మంచి పరిణామమని అన్నారు.ఇప్పటికే వచ్చిన ప్యాకేజ్డ్ నీరు కొన్ని రోజుల్లోనే అయిపోతుందన్నారు.పర్యాటక ప్రాంతం అయిన నార్త్ సిక్కిం లాంటి ప్రదేశాల్లో ఈపాటికే ప్యాకేజ్‌డ్ డ్రింకింగ్ వాటర్ నిషేదించినట్లు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube