అమెరికాలో సిక్కు వ్యక్తిపై జాత్యహంకార దాడి

విదేశీయులపై ముఖ్యంగా భారతీయులపై అమెరికన్ల జాత్యహంకార దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.తాజాగా ఓ సిక్కు వ్యక్తిపై ఓ అమెరికన్ పౌరుడు జాతినుద్దేశించి అసభ్యంగా మాట్లాడటంతో పాటు దాడికి పాల్పడ్డాడు.

 Sikh Uber Cab Driver American Washington-TeluguStop.com

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన డిసెంబర్ 5న వాషింగ్టన్‌కు సమీపంలోని బెల్లింగ్‌హామ్‌లో జరిగింది.

గ్రిఫిన్ లెవి సేయర్స్ అనే అమెరికన్ యువకుడు ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు.

దీనికి భారతీయ సిక్కు వ్యక్తి డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నాడు.సేయర్స్‌పు పికప్ చేసుకున్న డ్రైవర్ గమ్యస్థానం వైపు వేగంగా వెళుతున్నాడు.

ఈ క్రమంలో సేయర్స్ ఆ సిక్కు వ్యక్తి జాతిపై రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తూ అవమానించడం మొదలుపెట్టాడు.

Telugu Sikh Uber Cab, Telugu Nri Ups-

అక్కడితో ఆగకుండా అతనిపై దాడికి దిగి గొంతు పిసికాడు.సేయర్స్ బారి నుంచి తప్పుకున్న సిక్కు డ్రైవర్ 911కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.రంగంలోకి దిగిన పోలీసులు సేయర్స్‌ను అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.అనంతరం రూ.9,18,282 పూచీకత్తుపై బెయిల్‌పై విడుదల చేశారు.కాగా సిక్కులు వారి తలపాగా, వస్త్రధారణ కారణంగా తరచుగా అమెరికన్ల చేతిలో జాతి వివక్షకు గురవుతున్నారు.దీనిపై యూఎస్‌లోని పలు సిక్కు సంఘాలు అవగాహన కల్పించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube