యూకే : కమ్యూనిటీ ఈవెంట్‌లో కత్తిపోట్ల కలకలం.. సిక్కు వ్యక్తిపై అభియోగాలు

పశ్చిమ లండన్‌లోని సౌతాల్‌( Southall )లో జరిగిన కమ్యూనిటీ ఈవెంట్‌లో ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచిన కేసులో 25 ఏళ్ల సిక్కు వ్యక్తిని అరెస్ట్ చేసి అభియోగాలు మోపారు మెట్రోపాలిటన్ పోలీసులు.నిందితుడిని గురుప్రీత్ సింగ్‌( Gurpreet Singh )గా గుర్తించారు.

 Sikh Man Charged With Stabbing 2 People At Community Event In London's Southall,-TeluguStop.com

ఇతనిని లండన్‌లోని ఉక్స్‌బ్రిడ్జ్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరిచారు.గురుప్రీత్‌పై వరుస నేరాలకు పాల్పడినట్లుగా అభియోగాలు మోపారు.

సింగ్‌ను రిమాండ్‌‌కు తరలించాలని, సెప్టెంబర్ 14న లండన్‌లోని ఐల్‌వర్త్ క్రౌన్ కోర్టులో హాజరుపరచాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు.

Telugu Gurpreet Singh, London, Met, Sikh, Southall-Telugu NRI

మంగళవారం రాత్రి సౌత్‌హాల్‌లో జరిగిన భారత స్వాతంత్ర్య వేడుకలకు( Indian Independence Day Event ) సంబంధించిన కమ్యూనిటీ ఈవెంట్‌లో ఈ ఘటన జరిగింది.ఆ సమయంలో కొంతమంది ఖలిస్తానీ అనుకూల ఉగ్రవాదులు, అనుమానితులను పోలీసులు వెంబడిస్తున్న వీడియోలు సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఘటనపై మెట్రోపాలిటన్ పోలీస్ సూపరింటెండెంట్ సీన్ లించ్( Metropolitan Police Superintendent Sean Lynch ) మాట్లాడుతూ.

ఈ సంఘటన సౌత్‌హాల్, లండన్ పరిసర ప్రాంతాల్లో వున్న సిక్కు కమ్యూనిటీలను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.

దీనిపై విచారణ కొనసాగిస్తున్నామని.

సోషల్ మీడియా( Social Media )లో సర్క్యూలేట్ అవుతోన్న ఫుటేజీ గురించి తమకు సమాచారం వుందన్నారు.అదృష్టవశాత్తూ ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని.

ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని లించ్ తెలిపారు.ఇదే కేసులో మరో 20 ఏళ్ల యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే తదుపరి విచారణలు పెండింగ్‌లో వున్నందున అతను పోలీస్ బెయిల్‌పై విడుదలయ్యాడు.

Telugu Gurpreet Singh, London, Met, Sikh, Southall-Telugu NRI

నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసే సమయంలో మహిళా అధికారి చేతికి చిన్న గాయం తగిలిందని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై వెస్ట్ ఏరియా సీఐడీకి చెందిన మెట్ పోలీస్ డిటెక్టి( Met Police detectives )వ్‌ల నేతృత్వంలో విచారణ జరుగుతోంది.ఆ ప్రాంతంలో ప్రజలను చెదరగొట్టడానికి అధికారం కల్పించే సెక్షన్ 35 డిస్పర్సల్ ఆర్డర్‌ను అధికారులు ఎత్తివేశారు.

ఈ కత్తిపోట్ల ఘటనతో ఈ కార్యక్రమానికి హాజరైన వారికి కాసేపు ఏం జరుగుతోందో అర్ధం కాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube