ప్రపంచ యుద్ధాల్లో అసమాన సాహసం.. అలనాటి భారతీయ సైనికులకు యూకేలో అరుదైన గౌరవం

భారతీయ సైనికుల ధైర్య సాహసాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వీరి పోరాట పటిమను గుర్తించిన నాటి బ్రిటీష్ ప్రభుత్వం ముఖ్యమైన యుద్ధాల్లో భారతీయ సైనికుల్నే ముందు నిలబెట్టేది.

 Sikh Fighter Pilot Hardit Singh Malik Memorial Uk World War-TeluguStop.com

ప్రపంచ చరిత్రలో మాయని మచ్చగా వున్న రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ నాటి బ్రిటిష్ ఇండియా సైన్యం పాల్గొంది.ఆనాటి యోధులకు యూకేలో నేడు అరుదైన గౌరవం దక్కనుంది.

వివరాల్లోకి వెళితే… సిక్కు ఫైటర్ పైలట్‌గా, క్రికెటర్‌గా, గోల్ఫర్‌గా విశేష ప్రతిభ చూపిన హర్దిత్ సింగ్ మాలిక్ విగ్రహాన్ని ఇంగ్లాండ్‌లోని పోర్ట్ సిటీ సౌతాంప్టన్‌లో ఏర్పాటు చేయడానికి స్థానిక కౌన్సిల్ అనుమతించింది.అయితే ఆయనతో పాటుగా రెండు ప్రపంచ యుద్ధాల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారతీయ సైనికుల కోసం స్మారక చిహ్నాన్ని నిర్మించాలని కౌన్సిల్ నిర్ణయించింది.

 Sikh Fighter Pilot Hardit Singh Malik Memorial Uk World War-ప్రపంచ యుద్ధాల్లో అసమాన సాహసం.. అలనాటి భారతీయ సైనికులకు యూకేలో అరుదైన గౌరవం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హర్దిత్ సింగ్ మాలిక్ 14 ఏళ్ల వయసులో 1908లో యూకేకు వచ్చి, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని బల్లియోల్ కాలేజీలో చదువుకున్నాడు.అనంతరం మొదటి ప్రపంచ యుద్ధంలో రాయల్ ఫ్లయింగ్ కార్ప్స్ సభ్యుడిగా మారాడు.

మాలిక్ .రాయల్ ఫ్లయింగ్ కార్ప్స్‌లో చోటు దక్కించుకున్న మొదటి భారతీయుడే కాదు.తొలి సిక్కు వ్యక్తి కూడా.తద్వారా ఆ రోజుల్లో ఆయన ‘‘ ఫ్లయింగ్ సిక్కు’’గా గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల్లో బ్రిటీష్ సైన్యంలో కీలక పాత్ర పోషించిన హర్దిత్ సింగ్ మాలిక్ గురించి నేటి తరానికి అంతగా తెలియదు.అంతేకాదు ఆయనతో పాటు ఎంతోమంది వీరుల గాథలు మరుగున పడిపోయాయి.

ఈ నేపథ్యంలో హర్దిత్ అసాధారణ విజయాలు, బ్రిటిష్ సైన్యంలో ఆయన పోషించిన పాత్రపై సౌతాంప్టన్‌కు చెందిన వన్ కమ్యూనిటీ హాంప్‌షైర్ & డోర్సెట్ (ఓసీహెచ్‌డీ) ప్రచారం చేసింది.అటు నగరంలో హర్దిత్ విగ్రహ ఏర్పాటుకు సౌతాంప్టన్ సిటీ కౌన్సిల్ గతేడాది ఆమోదముద్ర వేసింది.

హర్దిత్ క్రికెటర్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.సస్సెక్స్ తరపున ప్రాతినిథ్యం వహించిన ఆయన.ఇండియన్ సివిల్ సర్వీసులో సుదీర్ఘ కెరీర్ తర్వాత ఫ్రాన్స్‌లో భారత రాయబారిగా కూడా పనిచేశాడు.అన్నింట్లోకి 1917-19 మధ్యకాలంలో బ్రిటీష్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గానే మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్ ప్రాంతంలోని స్మెత్‌విక్‌లో వున్న ‘‘లయన్స్ ఆఫ్ ది గ్రేట్ వార్ ’’ స్మారక చిహ్నం సహా ఇతర స్మారక చిహ్నాల రూపకల్పనలో పాలుపంచుకున్న ల్యూక్ పెర్రీ.సౌతాంప్టన్‌లోని స్మారక చిహ్నాన్ని రూపొందించారు.

ఇతనికి సౌతాంప్టన్ కౌన్సిల్‌తో పాటు స్థానిక గురుద్వారాలు సహకరిస్తున్నాయి.ఈ స్మారక చిహ్నం కోసం ఆన్‌లైన్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు నిర్వాహకులు.

#SikhFighter #Online Funds #Indians #World War

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు