హార్ట్ ఎటాక్ వచ్చేముందు మోగే ప్రమాద ఘంటికలు ఇవి  

Signs Of A Heart Attack Arrival -

హార్ట్ ఎటాక్ ఒక్కసారిగా సడెన్ గా రావొచ్చు.కాని అది ఒక్కరోజులో మొదలైనది కాదు కదా? ఏళ్ళుగా మనం పాటించిన లైఫ్ స్టయిల్ వలన వస్తుంది హార్ట్ ఎటాక్.సరైన తిండి తినక, వ్యాయామం చేయక, కోలెస్టిరాల్ లెవెల్స్ పెంచేసుకోని, చెకప్ చేయించుకోకుండా, కొవ్వు కరింగించుకోకుండా, అదే లైఫ్ స్టయిల్ ని పాటిస్తే ఎందుకు రాదు హార్ట్ ఎటాక్? ఇక హార్ట్‌ ఎటాక్ సడెన్ గా వచ్చినా, ఒక్కరోజులో మొదలయ్యే సమస్య కాదని చెప్పాంగా, అందుకే హార్ట్ ఎటక్ వచ్చేముందు మనం దాన్ని గుర్తించవచ్చు.కొన్ని ప్రమాద ఘంటికలు మన శరీరంలో మోగుతాయి.

వాటిని మనం గుర్తించి జాగ్రత్తపడాలి.అవెంటో చూడండి.

Signs Of A Heart Attack Arrival-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

* ఛాతిలో నొప్పిగా ఉంటుంది.ఎవరో ఛాతిని పట్టుకోని గట్టిగా లాగినట్టుగా, చేతులతో పిండుతున్నట్లుగా అనిపిస్తుంది.

ఇది స్త్రీ, పురుషులు ఇద్దరిలో కనిపించే హార్ట్ ఎటాక్ లక్షణం.

* దవడలో నొప్పి, దంతాల్లో తీవ్రమైన నొప్పి, తలనొప్పి .ఛాతి నొప్పిని అనుసరించే ఇతర ప్రమాద ఘంటికలు.కొంతమంది ఛాతి నొప్పి లేకున్నా ఈ నొప్పులు కలగవచ్చు.

ఛాతిలో నొప్పిలేదు కదా అని ఈ నొప్పులను తేలిగ్గా అస్సలు తీసుకోకూడదు.కొందరికి భుజాలు కూడా నొప్పివేస్తాయి.

ఈ నొప్పులన్ని కలిసి వచ్చినప్పుడు అజాగ్రత్త వద్దు.

* శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది.

గాలి మనదాకా రానట్టుగా అనిపిస్తుంది.గాలి అందనట్టుగా ఉంటుంది.

శ్వాస గట్టిగా పీల్చుకోలేరు.ఇలాంటి ఇబ్బందినే డిస్పీనియా అని మెడికల్ భాషలో అంటారు.

ఇది కూడా ఓ ప్రమాద ఘంటికే.కొందరికి ఛాతినొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే, మరికొందరికి ఛాతి నొప్పి లేకుండానే ఈ ఇబ్బంది ఉంటుంది.

* చెమటలు బాగా పట్టడం కూడా ఓ హెచ్చరిక.చెమటలు ఎలా పడతాయి అంటే తడిసి ముద్దయిపోతారు.

ఉక్కపోత ఉన్నా లేకున్నా చెమటలు పడతాయి.

* వీపు పైభాగంలో నొప్పులు మొదలవొచ్చు.

రెండు భుజాల మధ్య ఇలా ఎక్కువ జరుగుతుంది.

* కడుపు పైభాగంలో, సరిగా మధ్యలో నొప్పి లేస్తుంది.

కొందరికి ఎవరో పొడిచేనట్టుగా, భరించలేని నొప్పి ఉంటుంది.

* అన్నం అరగకపోవడం, ఎంత తిన్న కడుపు ఖాలిగానే అనిపించడం, అలసట, వాంతులు .ఇవి కూడా హెచ్చరికలే.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు