హార్ట్ ఎటాక్ రాబోతోంది అనడానికి సంకేతాలు

మనం ఇంతకుముందు చదువుకున్నట్టుగా, ” Prevention is better than cure” అని అంటారు పెద్దలు.అంటే సమస్యను వచ్చాక వదిలించుకోవడం కంటే, రాకుండా అడ్డుకోవడం మేలు.

 Signs Of Heart Attack Risk-TeluguStop.com

హార్ట్ ఎటాక్ చెప్పి రాదు కదా.వస్తే ఉంటామో పోతామో కూడా చెప్పలేం.అలాంటి ప్రమాదకరమైన హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొన్ని సంకేతాలిస్తుంది.వాటిని మనం పసిగట్టి, తొందరగా డాక్టర్ ని ఆశ్రయించాలి.

* కారణం లేకుండా మైకం కమ్మినట్టు అనిపించడం, తలనొప్పి మాటిమాటికి వస్తుండటం మంచి సంకేతాలు కాదు.మీ గుండె మెదడుకి రక్తాన్ని సరిగా సరఫరా చేయలేకపోతోంటే ఇలా జరుగుతుంది.

దీనర్థం గుండె ఆరోగ్యంగా లేదు.

* ఛాతి పట్టేసినట్టు, మంటగా, నొప్పిగా, గుండెమీద బరువు మోపినట్టు రెగ్యులర్ గా అనిపిస్తే గుండె ప్రమాదంలో ఉన్నట్టే.

* దీర్ఘకాలిక ఇంఫెక్షన్లు కనబడితే అలర్ట్ అవండి.గుండెకి ఆక్సిజన్ సరిగా అందకపోతే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది.

తద్వారా వారాలకొద్ది, నెలల కొద్ది, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి.

* పనేం చేయకుండానే అలసిపోవడం, అసలేమాత్రం ఉత్సాహంగా ఉండకపోవడమే కూడా ప్రమాదకర సంకేతాలు.

* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా, గుండె ప్రమాదంలో ఉన్నట్లే.గుండె ఆరోగ్యంగా లేకపోతే ఊపిరితిత్తులు కూడా సరిగా పనిచేయలేవు.

* చేతులు, పాదాలు, పొట్ట దగ్గర వాపులు కనబడుతున్నాయంటే గుండె రక్తాన్ని సరిగా శుద్ధి చేయలేకపోతోంది అన్నమాట.అలాంటిప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించండి.

* మంచి ఆహారం తీసుకున్నా వికారం, అజీర్ణం లాంటి సమస్యలతో పాటు ఛాతిలో మంటగా అనిపిస్తే జాగ్రత్తగా మెదలడం మొదలుపెట్టండి.వైద్యుడిని సంప్రదించి వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube