వధూవరుల తలపై జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో తెలుసా.? ఆ సమయంలో రసాయనిక చర్య జరిగి.!       2018-06-15   23:45:10  IST  Raghu V

రెండు మనసుల్ని దగ్గర చేసే వేడుక వివాహం. ఇద్దరు మనుషులే కాదు రెండు కుటుంబాలు, సంప్రదాయాలు కలుస్తాయి పెళ్ళిలో. ఒకొక్క మతంలో పెళ్లి ఒకో విధంగా ఉంటుంది. క్రిస్టియన్స్ లో రింగులు మార్చుకుంటారు. హిందువుల్లో మంగళసూత్రం కడతారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి తలపై ఒకరు జీలకర్రబెల్లం పెట్టుకుంటారు వధూవరులు. అసలు జీలకర్ర బెల్లం రెండు భిన్నమైన లక్షణాలు కల పదార్థాలు. పెళ్లిలో వధూవరులు ఒకరి తలపై ఒకరు అది ఎందుకు పెట్టుకుంటారు. పైగా ఆ సమయంలోనే ‘’ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతిః/ ధ్రువంత ఇన్ద్రశ్చాగ్నిశ్చ రాజ్యం ధారయతాం ధ్రువమ్” వంటి మంగళప్రదమైన మంత్రాలను ఈ సందర్భంలో చదువుతారు. జీలకర్ర బెల్లం వెనకున్న అసలు కథ ఏంటో చూడండి!

-

వివాహ సమయంలో పెళ్లికూతురు, పెళ్లికూతుర్ల మధ్య ఒక తెరని ఉంచుతారు. తెలుగు పెళ్లిళ్లలో జీలకర్ర, బెల్లం పెట్టడం ఒక సంప్రదాయం. వధూవరులు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర, బెల్లం ఉంచిన తరువాతే వారి మధ్య ఉన్న తెరని తొలగిస్తారు. అప్పుడు కూడా ఒకరి భృకుటిని మరొకరు చూడాలని చెబుతారు. వధూవరుల స్పర్శ, చూపు… రెండూ కూడా శుభ్రప్రదంగా ఉండేందుకే ఈ నియమం పెట్టినట్లు తోస్తుంది.

శాస్త్రరీత్యా ఈ ”గుడజీరక” మిశ్రమానికి బ్రహ్మరంధ్రాన్ని తెరిపించే శక్తి ఉంటుందని శాస్త్రాలు చెపుతున్నాయి. అలా జీలకర్ర, బెల్లం కలిపి నూరిన ముద్దని తలలమీద పెట్టుకునే సమయంలో ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకోవాలి. అలా చూసుకున్న సమయంలో వధూవరులిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఆకర్షణ కలిగి, జీవితాంతం అన్యోన్యంగా కలసిమెలసి ఉంటారన్నది దీని ఆచారం. జీలకర్ర, బెల్లం వలన ఏర్పడి రసాయనక చర్య వల్ల మానసిక బంధం బలపడుతుందని మన పూర్వీకుల అభిప్రాయంగా ఉంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.