ప్రపంచ గుడ్డు దినోత్సవం అసలు ఎందుకు జరుపుకుంటారో.. ఎప్పుడు నుంచి ప్రారంభమైందో తెలుసా...?

ప్రస్తుత రోజుల్లో రోజూ ఏదో ఒక అంశానికి చెందిన రోజు అంటూ సెలబ్రెట్ చేసుకుంటూనే ఉంటాం.ఇకపోతే నేడు ఆగస్టు రెండో శుక్రవారాన్ని వరల్డ్ ఎగ్ డే ను జరుపుకుంటున్నాం.

 Significance Of World Egg Day, World Egg Day, Second Friday In October, Internat-TeluguStop.com

ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండవ శుక్రవారాన్ని వరల్డ్ ఎగ్ డే గా మనం జరుపుకుంటున్నాం.అసలు ఈ ఎగ్ డే ను జరుపుకోవడానికి గల కారణం ఏమిటి…? ఇలా జరుపుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో.ఓసారి చూద్దామా…!

అసలు ఈ ఎగ్ డే ఎప్పుడు నుంచి మొదలైంది అని అంటే మొదటగా 1996 సంవత్సరంలో వియన్నాలో జరిగిన ఓ సమావేశంలో ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.దీంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో శుక్రవారం ఎగ్ డే గా జరుపుకునే విధంగా నిర్ణయం తీసుకున్నారు.

గుడ్డు తినడం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజానీకానికి అవగాహన కల్పించడం, అలాగే గుడ్లు తినడం ద్వారా ఎలాంటి ఆహార పోషకాలు లభిస్తాయో అన్న వాటి గురించి తెలిపేందుకు ఈ ఎగ్ డే ని జరుపుతున్నారు.గుడ్డు తినడం పై, గుడ్డు తినడం ద్వారా మనిషి శరీరానికి ఎలాంటి పోషక విలువలు లభిస్తాయి అన్న విషయాన్ని తెలపడం కోసమే ఈ ఎగ్ డే ను జరపాలని నిపుణులు సూచించారు.

దీంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో శుక్రవారం ప్రపంచ ఎగ్ డే గా జరుపుకుంటున్నారు.

ఇక అందరికీ తెలిసిందే గుడ్డు తినడం ద్వారా మనిషికి ఎలాంటి పోషక విలువలు అందుతాయో.

ఇక మనం తీసుకొనే సమతుల్య ఆహారంలో గుడ్డు ఎంతో ప్రధాన పాత్రను పోషిస్తుంది.ఇకపోతే వరల్డ్ ఎగ్ డే సందర్భంగా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో ఉచితంగా గుడ్లను పంపిణీ కూడా చేస్తున్నారు.

ఇలాంటి కార్యక్రమాలు ఎంతో మంది నిరుపేద వారికి ఉపయోగకరంగా మారుతున్నాయి.

వీటిని తినడం ద్వారా మన శరీరానికి అనేక రకాల కేలరీలు లభించడమే కాకుండా, నాణ్యత కలిగిన ప్రోటీన్స్ మనకు లభిస్తాయి.

ఇక ఈ గుడ్డు ద్వారా అనేక రెసిపీ లను అతి త్వరగా కూడా చేసుకొని తినవచ్చు.ప్రస్తుత కాలంలో గుడ్లు బ్రేక్ ఫాస్ట్ గా కూడా మారిపోయింది.

ఈ గుడ్డు ను అనేక మంది వివిధ రకాలుగా వారి స్టైల్స్ లో వండుకొని తింటారు.ఎవరి స్టైల్స్ లో వారు ఆమ్లెట్స్ వేసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube