దైవ కార్యాలు,పండుగలు,వ్రతాలు,నోములు చేసుకొనే సమయంలో తప్పనిసరిగతాంబూలం ఉంటుంది.మనం చేసే పూజలో ధూప .దీప .నైవేద్యాల తరవాతప్పనిసరిగా తాంబూలం ఉండవలసిందే.అంతేకాక పూజ చేయించిన పురోహితునికదక్షిణ ఇచ్చే సమయంలో కూడా తాంబూలం ఇవ్వటం పరిపాటి.
నోములు … వ్రతాల సమయంలోను ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు వాయినాలతో పాటతాంబూలం కూడా ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది.ఇక వివాహం విషయానికి వస్తపెళ్లి కుదుర్చుకునే సమయంలో ‘తాంబూలాలు’ మార్చుకునే సంప్రదాయం వుందికొన్ని సందర్భాలలో మొదట తాంబూలాన్ని అందుకోవటం గొప్ప ఘనతగా భావిస్తఉంటారు.నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, కడుపులోని క్రిములను సైతం ఇదనశింపజేస్తుంది.నాలుకను శుభ్ర పరచడమే కాకుండా, దంత వ్యాధులను …గొంతుకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది.అయితే తాంబూలాన్ని మితంగసేవిస్తేనే ఔషధంగా పనిచేస్తోందని శాస్త్రం చెప్పుతుంది.