స్వస్తిక్ చిహ్నం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

చాలా మంది స్వస్తిక్ గుర్తు హిందూ మతానికి గుర్తు అని భావిస్తారు .సంస్కృతం లో స్వస్తిక అంటే సు- మంచి, అస్తి – కలగటం.

 Significance Of Swastik-TeluguStop.com

మంచిని కలిగించడం అని అర్ధం.స్వస్తిక అంటే దిగ్విజయం.

స్వస్తిక్ చిహ్నం అనేది హిందూ మతంలో ఓంకారం తరువాత అంత ప్రాముఖ్యతను కలిగి ఉన్న చిహ్నం .జీవన చక్రాన్ని స్వస్తిక సూచిస్తుంది.స్వస్తిక గుర్తులో ఉండే నాలుగు గదులు స్వర్గం, నరకం, మానవుడు, జంతుజాలాలను సూచిస్తాయని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.

హిందూ మతం లో అత్యంత ప్రాముఖ్యం కలిగిన స్వస్తిక గుర్తు ,హిందూ మత ఆచారాలను అనుసరించే బౌద్ధ, జైన మతాలలో కూడా కనబడుతుంది.

అమెరికా,జపాన్, ఉక్రెయిన్, ఇథియోపియా దేశాలలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది.ప్రపంచం నలుమూలలా స్వస్తిక గుర్తును అదృష్టానికి, శుభానికి చిహ్నం గా భావిస్తారు.

ఉక్రెయిన్ లో 12000 సంవత్సరాల నాటి స్వస్తిక గుర్తు లభించింది.పాశ్చాత్య దేశాలలోని ప్రార్థనా మందిరాలలో,ప్రసిద్ధ కట్టడాలలో స్వస్తిక గుర్తు కనబడుతుంది.

హిందూ మతం లోనుండే స్వస్తిక గుర్తు ప్రపంచ దేశాలకు వ్యాపించిందని పరిశోధకులు నిర్ధారించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube