పుత్ర సంతానం కలగాలంటే ఈ వ్రతం చేయాల్సిందే..?

హిందూ ప్రజలు ఎంతో పరమ పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంటారు.ఈ మాసంలో మన ఇల్లు కూడా సాక్షాత్తు ఆలయాన్ని తలపిస్తుంది.

 Significance Of Shravana Putrada Ekadashi Shravana Putrada Ekadashi, Lard Vishnu-TeluguStop.com

ఈ విధంగా ఈ మాసంలో వచ్చే మంగళ, శుక్రవారాలు పెద్ద ఎత్తున అమ్మ వారికి వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఈ మాసంలో వచ్చే ఏకాదశి కూడా ఎంతో పవిత్రమైనదని చెప్పవచ్చు.

సాధారణంగా ఒక నెలలో శుక్లపక్షం కృష్ణపక్షం ఉంటాయి.ఈ పక్షంలో వచ్చే పదకొండవ రోజున ఏకాదశి అని పిలుస్తారు.

ఈ విధంగా నెలకు రెండు ఏకాదశులు చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి.

ఈ క్రమంలోనే శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి పరమ పవిత్రమైన ఏకాదశిగా భావిస్తారు.

ఈ ఏకాదశిని శ్రావణ పుత్రాద ఏకాదశి అని కూడా పిలుస్తారు.ఏకాదశి విష్ణుమూర్తికి ఎంతో ప్రత్యేకమైనదని చెప్పవచ్చు.

శ్రావణ మాసంలో శుక్ల ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ప్రత్యేక వ్రతం ఆచరించడం వల్ల వారికి సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.పుత్ర ఏకాదశి గురించి భవిష్య పురాణంలో ఎంతో అద్భుతంగా వివరించబడింది.

ఈ పురాణం ప్రకారం మహిజిత్తు అనే రాజు తన రాజ్యంలోని ప్రజలందరూ సిరిసంపదలతో ఆనందంగా ఉండాలని భావించాడు.ఈ క్రమంలోనే ప్రజలకు ఏ కష్టాలు లేకుండా చూసుకొని ఈ రాజుకు సంతానం లేకపోవడం ఒక్కటే ఎంతో బాధాకరమైన విషయం.

గ్రామ ప్రజలు కూడా తమ రాజుకు సంతానం కలగాలని పెద్ద ఎత్తున పూజలు నిర్వహించేవారు.ఈ క్రమంలోనే సంతానం కోసం రాజు చేయని పూజ లేదు, హోమం లేదు.

ఇదిలా ఉండగా తమ రాజ్యానికి సమీపంలోనే లోమశుడనే మహర్షి ఉన్నడని తెలుసుకున్న గ్రామ ప్రజలు ఏ వ్రతం చేస్తే తమ రాజుకు సంతానం కలుగుతారు చెప్పమని ఆ మహర్షిని వేడుకోగా అప్పుడు లోమశుడనే మహర్షి శ్రావణ మాసంలోని మొదటి ఏకాదశిని నిష్ఠగా ఆచరిస్తే వారికి సంతానం కలుగుతుందని చెప్పాడు.
.

ఆ మహర్షి సూచన ప్రకారం రాజ్యంలోని రాజ దంపతులతో పాటు ప్రజలందరూ కూడా ఎంతో నిష్టగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు.ఈ విధంగా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ రాజుకు పుత్రసంతానం కలిగింది.అప్పటినుంచి ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు.ఈ గతం ఆచరించేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేసి ఈ ఆలయాన్ని సందర్శించి సూర్యాస్తమయానికి ఉపవాసం విడిచి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల సంతానయోగం కలుగుతుందని భవిష్య పురాణం చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube