నవంబరు 18 అమావాస్య రోజు ఈ ఒక్కటి దానం చేస్తే మీ అదృష్టం మారిపోతుంది.  

కార్తీకమాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే తలస్నానము చేసి శివుని పూజ,దీపాలు వెలిగిస్తే ఎంత మంచి జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే కార్తీక పౌర్ణమి నాడు ప్రత్యేకంగా పూజలు చేయటం వలన కూడా ఈ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. అదే కార్తీక సోమవారం నాడు సూర్యోదయానికి ముందు తలస్నానము చేసి దీపాలు వెలిగించి ఉపవాసం ఉంటే మరణించాక కైలాసానికి వెళతారు.

కార్తీక మాసంలో హిందువులు బిచ్చగాళ్లకు దానం చేయాలి. అలాగే ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టటం కూడా చాలా గొప్పది. అంతేకాక కార్తీకమాసంలో ఇచ్చే దానాల గురించి కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అలాగే తప్పనిసరిగా ఆచరించి తీరాలి. దానాలలో చాలా రకాలు ఉన్నాయి. దానం చేయటం వలన పుణ్యం వస్తుంది. ఇక విషయానికి వస్తే నవంబర్ 18 అమావాస్య రోజుతో కార్తీకమాసం ముగుస్తుంది. కార్తీకమాసం చివరి రోజైన అమావాస్య నాడు చేసే దానం కార్తీక మాసం నెల రోజుల కన్నా ఎక్కువ పుణ్యం వస్తుంది. అందువల్ల ఆ రోజున దానాలు చేస్తే చాలా మంచిది.


కార్తీకమాసం చివరి రోజైన నవంబర్ 18 న సూర్యోదయానికి ముందే కార్తీక స్నానము చేసి శివాలయానికి వెళ్లి అభిషేకం చేసి బిచ్చగాళ్లకు రాగి వస్తువులను దానం చేయాలి. ఇలా రాగి వస్తువులను దానం చేయటం వలన ఆ ఒక్కరోజే చాలా పుణ్యం వస్తుంది. అలాగే కార్తీకమాసం చివరి రోజున పోలి స్వర్గాన్ని నిర్వహిస్తారు. పోలి అనే మహిళ అత్తగారు పెట్టె బాధలు భరిస్తూ అత్తగారికి తెలియకుండా కార్తీకమాసం నెల రోజులు దీపాన్ని వెలిగిస్తూ ఉంటుంది. కార్తీకమాసం చివరి రోజు పోలికి ఖాళీ లేకుండా చాలా ఎక్కువ పనిని చెప్పుతుంది. పోలి పని చేస్తూ ఉంటే అత్తగారు మిగతా కోడళ్ళు దీపాలు వెలిగించటానికి నదికి వెళతారు.

పోలి అత్తగారు చెప్పిన పనులను గబగబా చేసేసి పోలి 30 ఒత్తులతో అరటి దోనెలో దీపాలను వెలిగిస్తుంది. కార్తీకమాసం నెల రోజులు నిర్మలమైన మనస్సుతో శివుని మీద లగ్నం చేసి పూజ చేయటం వలన చివరి రోజు పోలిని స్వర్గానికి తీసుకువెళ్ళడానికి దేవ దూతలు విమానంలో వస్తారు. అత్త, మిగతా కోడళ్ళు తమ కోసమే ఆ విమానం వచ్చిందని అనుకోని చాల ఆనందపడతారు. కానీ ఆ విమానం పోలి కోసం వచ్చిందని తెలిసి చాల ఆశ్చర్యపోతారు. దేవతలు పోలిని స్వర్గానికి తీసుకువెళతారు. అందువల్ల కార్తీకమాసం చివరి రోజున పోలి స్వర్గాన్ని నిర్వహిస్తారు. పోలి స్వర్గంతో కార్తీక మాసం ముగుస్తుంది.