కామాక్షి దీపం ఎలా పెట్టాలి.. ఈ దీపం ప్రత్యేకత ఏమిటో తెలుసా?

దీపం అనేది అంధకారాన్ని తొలగించి వెలుగులు నింపుతుంది.అందుకే మనం ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల మన జీవితంలో ఏర్పడే చీకటిని తొలగించి ఆనందం అనే వెలుతురుని ప్రసాదిస్తుంది.

 Significance Of Kamakshi Deepam Kamakshi Deepam, Significance, Pooja, Gajalakshm-TeluguStop.com

అందుకే ప్రతి రోజు దీపారాధన చేయాలని మన పెద్దవారు చెబుతుంటారు.అయితే ఈ విధంగా దీపారాధన చేసేటప్పుడు మూడు వత్తులతో దీపారాధన చేయాలి.

దీపం విజయానికి సంకేతం అందుకోసమే పూర్వకాలంలో రాజులు యుద్ధానికి వెళ్లే సమయంలో వీరతిలకం దిద్ది హారతి ఇచ్చేవారు.అయితే ఎంతో విశిష్టత కలిగిన ఈ దీపం ఎల్లప్పుడూ కూడా మట్టి ప్రమిదలో వెలిగించాలి.

అయితే దీపాలలో కూడా కొన్ని రకాలు ఉంటాయి.అందులో ఒకటే కామాక్షి దీపంఅసలు కామాక్షి దీపం అంటే ఏమిటి? కామాక్షి దీపం ఎలా వెలిగించాలి? ఈ దీపం యొక్క విశిష్టత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

కామాక్షి దీపం అంటే దీపపు ప్రమిదకు వెనుక భాగాన గజలక్ష్మి చిత్రం ఉంటే ఆ దీపాన్ని కామాక్షి దీపం అంటారు.అదేవిధంగా గజ దీపం అని కూడా పిలుస్తారు.

ఈ విధమైనటువంటి ప్రమిదను వెలిగించడం ద్వారా ఆ దీపపు వెలుగులో కామాక్షి అమ్మవారు ఉండడం వల్ల దీనిని కామాక్షి దీపం అని పిలుస్తారు.సాధారణంగా కామాక్షి దేవి సర్వదేవతలకు శక్తిని ప్రసాదిస్తుందని చెబుతారు.

అందుకోసమే కామాక్షి దేవి ఆలయాన్ని అన్ని ఆలయాల కంటే ముందుగా తెరిచి పూజలు నిర్వహిస్తారు.అదే విధంగా అన్ని ఆలయాల కంటే ఆఖరిగా కామాక్షి ఆలయాన్ని మూసివేస్తారు.

Telugu Gajalakshmi, Kamakshi Deepam, Lakshmithamara, Pooja, Significance-Telugu

కామాక్షి దీపాన్ని కేవలం ప్రమిదలా మాత్రమే కాకుండా ఒక విలువైన వస్తువుగా భావిస్తారు.ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు లేదా వ్రతాలు జరుగుతున్నప్పుడు, లేదా గృహప్రవేశ సమయంలో తప్పనిసరిగా ఈ కామాక్షి దీపాన్ని వెలిగిస్తారు.అయితే సాధారణ దీపం మాదిరిగా కాకుండా కామాక్షి దీపం వెలిగించేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి.

ఎంతో పవిత్రమైన ఈ దీపాన్ని వెలిగించే టప్పుడు ముందుగా దీపపు ప్రమిదకు అమ్మవారికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి.అదే విధంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి అక్షింతలతో అమ్మవారికి పూజ చేసి నమస్కరించాలి.

కామాక్షి దీపాన్ని వెలిగించే వారు కేవలం ఒకే ఒత్తి వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ తామర వత్తులతో పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

ఈ విధంగా రోజు కామాక్షి దీపం పెడుతూ కేవలం పౌర్ణమిరోజు ఈ దీపాన్ని కుల దేవత యంత్రం పై ఉంచి వెలిగించడం ద్వారా సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube