ఆ రెండింటితో ధూపం వేస్తే ఎన్ని లాభాలో తెలుసా?  

ఏదో ఒక సందర్భంలో ప్రతి ఇంటిలోనూ ధూపం వేయటం సహజమే. అయితే వారి సంప్రదాయాలను అనుసరించి ధూపాలను వేస్తూ ఉంటారు. ధూపం వేయటం వలన ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయి మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. అలాగే మానసిక ఉల్లాసం కలగటంతో చాలా సంతోషంగా ఉంటారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఇప్పుడు చెప్పే విధంగా ధూపం వేస్తె వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.

ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కర్పూరం, లవంగం కాల్చి ఆ ధూపాన్ని ఇళ్లంతా చూపించాలి. ఆ తర్వాత పూజ చేసి కర్పూర హారతి తీసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన వాస్తు దోషాలు పోవటమే కాకుండా ఇంటిలో ధన నష్టం కూడా ఉండదు. అలాగే ఇంట్లో నిప్పులు కాల్చి వాటిపైన గుగ్గుల్ పెట్టాలి. గుగ్గుల్ సువాసన కారణంగా మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఇంట్లో ఎవరైనా మానసిక రోగులు ఉంటే వారికి కూడా నయం అవుతుంది. గుగ్గుల్ అనేది మార్కెట్లో సులభంగా దొరుకుతుంది.

ఆవు పిడకలను కాల్చి దానిమీద పసుపు రంగు ఆవాలు వేసి ఆ ధూపాన్ని ఇళ్లంతా చూపిస్తే ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. సంపాదించిన ధనం చేతిలో నిలవకపోతే అగర్‌బత్తీ ధూపం వేయాలి. ప్రతి శుక్రవారం దుర్గామాత గుడికి వెళ్ళి పూజ చేసి అగర్‌బత్తీలను వెలిగించాలి. ఈ విధంగా చేస్తే ధన వృద్ధి కలుగుతుంది. వేపాకుతో ధూపం వేస్తే ఇంకా చాలా మంచిది.. వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.