గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది.సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఎన్ని కష్టాలను పడటానికి అయినా సిద్ధపడతారు.

 Significance Of Bringing Cow Into A New House, Cow , Gruha Pravesham ,new House-TeluguStop.com

ఊరు సొంత ఊరు అని చెప్పుకోవాలంటే సొంత ఇల్లు ఉండాలని భావిస్తారు.లేదంటే ఆ ఊరికి తాము పరాయివాళ్ళం అనే భావన కలుగుతుంది.

అందువల్ల ప్రతి ఒక్కరు సొంత ఇల్లు ఉండాలని అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.ఇల్లు కట్టుకున్నాక బందువులను పిలిచి ‘గృహప్రవేశం‘ చేస్తుంటారు.

ఆ సమయంలో కొత్త ఇంటిలోకి ముందుగా గోమాతను తీసుకువెళ్లి మొత్తం ఇల్లంతా తిప్పుతారు.ఆ తర్వాతే ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు ఇంటిలోకి వెళతారు.

ఈ ఆచారం అనాదిగా వస్తుంది.

గోవు సకలదేవతా స్వరూపంగా చెప్పబడింది.

గోవుతో పాటే సమస్త దేవతలు వస్తారని శాస్త్రం చెబుతోంది.అందువలన నూతన గృహాల్లోకి గోవును తిప్పటం అనేది శుభ సూచకంగా విశ్వసిస్తుంటారు.

నూతన గృహంలో గోవు మూత్రం … పేడ వేసినట్లయితే మరింత శుభకరంగా భావిస్తుంటారు.అదే బహుళ అంతస్తుల్లో గృహప్రవేశం చేసినప్పుడు గోవును బహుళ అంతస్తుల్లో తిప్పటం కుదరదు.

కాబట్టి ఆ ప్రాంగణంలో ఆవు దూడలను అలంకరించి పూజ చేయాలి.అలాగే గోవు పేడను .మూత్రాన్ని ఇల్లంతా చిలకరించాలి.

Significance Of Bringing Cow Into A New House, Cow , Gruha Pravesham ,new House , Good Significance , Pooja . God , House, Devotional - Telugu Devotional, Significance, Gruha Pravesham, Pooja God

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube