చేతినిండా గోరింటాకు పెట్టుకుంటే.....కష్టాలు ఉండవంట.... ఎలాగో తెలుసుకుందాం  

Significance Mehendi Indian Marriages-

మన పురాణాల్లో చేతి నిండా గోరింటాకు పెట్టుకుంటే కష్టాలు ఉండవని చెపుతున్నాయి.చిన్న వేడుక అయినా పెద్ద వేడుక అయినా మహిళలు గోరింటాకు పెట్టుకుంటారు.

మహిళలకు గోరింటాకు అంటే చాలా ఇష్టం.గోరింటాకుకు ఇంత గొప్పతనం రావటానికి సీతాదేవి కారణం అట.

Significance Mehendi Indian Marriages- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Significance Mehendi Indian Marriages---

అది ఎలాగా అంటే సీతాదేవిని రావణాసురుడు అపహరించినప్పుడు సీతాదేవి తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకొనేది.

రాముడు రావణాసురుని సంహరించి సీతాదేవిని తీసుకువెళ్లే సమయంలో సీతాదేవి గోరింటాకు చెట్టును ఏదైనా వరాన్ని కోరుకోమని అంటుంది.

అప్పుడు గోరింటాకు చెట్టు నాకు ఏమి వరాలు వద్దు మీలాగా లోకంలో ఉన్న మహిళల ముఖాలు సంతోషంతో కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటుంది గోరింటాకు చెట్టు.దాంతో సీతాదేవి గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది.గోరింటాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో.వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో.వారికి సకలసంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయి.వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెప్తుంది.అప్పటి నుంచి పెళ్లిళ్లలో గోరింటాకు పెట్టుకోవటం రివాజుగా మారింది.

మహాలక్ష్మిని ధ్యానిస్తూ చేతి నిండా గోరింటాకు పెట్టుకుంటే మహాలక్ష్మి అనుగ్రహం లభించటమే కాకుండా ఎటువంటి కష్టాలు ఉండవు.

DEVOTIONAL