ఆ దేశంలో సిగ్నల్ యాప్ బ్యాన్.. ఎందుకంటే..?!

చైనా దేశం ఎప్పుడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఎవరికి అంతు చిక్కడం లేదు.ఇప్పుడు చైనా సరి కొత్తగా వాట్సప్‌ కు ప్రత్యమ్నాయంగా ఉన్న సిగ్నల్‌ యాప్‌ ను బ్యాన్‌ చేసింది.

 Signal App Bannedd In Chaina Whatsappgoogletwitterfacebook-TeluguStop.com

ఈ ఒక్క యాప్ మాత్రమే కాకుండా అంతకముందు ఫేస్‌ బుక్, ట్విట్టర్, గూగుల్‌ యాప్స్‌ ను కూడా నిషేదించిన విషయం తెలిసిందే.తాజాగా మళ్ళీ ఇప్పుడు సిగ్నల్‌ యాప్‌ ను నిషేధించింది.

చైనా నుంచి వచ్చిన టిక్‌ టాక్‌ అనే యాప్ ను పలు దేశాలు బ్యాన్‌ చేయగా ఇప్పుడు ఈ సిగ్నల్‌ యాప్‌ ను చైనా బ్యాన్‌ చేయడం సంచలనంగా మారింది.

ఈ సిగ్నల్ యాప్ లో ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజింగ్‌ సర్వీసు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే చైనా ఇప్పటికే అమెరికాకు చెందిన పలు యాప్స్‌ బ్యాన్‌ చేసింది.అంతేకాకుండా అత్యంత ఆదరణ సంపాదించుకున్న గూగుల్‌ బ్రౌజర్‌ ను కూడా బ్యాన్‌ చేసిన దేశంగా చైనా వార్తల్లోకి ఎక్కింది.

చైనా ప్రభుత్వం అక్కడ ప్రజలపై అత్యంత కట్టు దిట్టమైన నిఘా ఉంచుతుంది అనే చెప్పాలి.అక్కడి ప్రజల ఇంటర్నెట్‌ వాడకంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు నియంత్రణ ఉంచుతుంది.

అందుకే అంతర్జాతీయ వెబ్‌ సైట్స్‌ వారి దేశంలోకి ప్రవేశించకుండా ‘గ్రేట్‌ ఫైర్‌వాల్‌’ అనే సాఫ్ట్‌ వేర్ పలు వెబ్‌ సైట్లను అడ్డుకుంటుంది.కానీ వాట్సప్‌ కు ప్రత్యామ్నాయంగా వచ్చిన సిగ్నల్‌ యాప్‌ ను అనేక దేశాలు వాడుతున్నాయి.

చైనాలో కూడా ఈ యాప్ డౌన్‌ లోడ్‌ చేసుకున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.అలాగే ఎలాన్‌ మస్క్‌ లాంటి దిగ్గజ టెక్‌ కంపెనీ వ్యవస్థాపకుడు సిగ్నల్‌ యాప్‌ ఉపయోగించాలని ట్విట్టర్‌ లో పిలుపునివ్వడంతో ఈ మెసేజింగ్‌ యాప్‌కు విశేష ఆదరణ లభించింది.

ఇప్పటికే చైనాలో గూగుల్‌ కు బదులుగా ‘బైదు’ అనే బ్రౌజర్‌ నడుస్తుంది.ఈ నేపథ్యంలోనే చైనా ఇష్టారాజ్యంగా యాప్స్‌ డిలీట్‌ చేస్తోంది.చైనాకి సంబంధించిన యాప్స్ కొన్ని దేశాల్లో నిషేధించిన విషయం గమనార్హం అనే చెప్పాలి.ఒకవేళ దానిని పరిగణలోకి తీసుకుని ఇప్పుడు సిగ్నల్ యాప్ నిషేదించారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube