పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవి అధిరోహించిన సిద్ధూ..!!

ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నీ పంజాబ్ అధ్యక్షుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో  నేడు సింధూ చండీగఢ్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు.

 Sidhu Ascends To The Post Of Punjab Congress Pcc Chief-TeluguStop.com

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉత్తేజ పరిచే రీతిలో ప్రసంగించారు.కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే తరహాలో కార్యక్రమాలు చేపడతామని.

తన దృష్టిలో నాయకులు కార్యకర్తలు అందరు ఒకటేనని.అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

 Sidhu Ascends To The Post Of Punjab Congress Pcc Chief-పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవి అధిరోహించిన సిద్ధూ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంత మాత్రమే కాక పంజాబ్ రాష్ట్రంలో విద్యుత్ కొరత అధిగమించే దిశగా అడుగులు వేస్తామని చెప్పారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీఎం అమరేందర్ సింగ్..కి సిద్ధూ కి మధ్య వివాదాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.

ఇలాంటి తరుణంలో పీసీసీ చీఫ్ అధ్యక్ష పదవి స్వీకారానికి ముందు అమరేందర్ సింగ్ పక్కనే కూర్చుని.ఉన్న సిద్దు తనదైన శైలిలో బ్యాటింగ్ కి వెళ్తున్నట్లు.ఫోజులు ఇచ్చి.సిక్స్ కోడుతున్నట్లుగా కార్యకర్తల వైపు తిరిగి హవాభావాలు పలకడంతో ఒక్కసారిగా సభ ప్రాంగణం హర్షధ్వానాలతో దద్దరిల్లింది.

వాస్తవానికి ఈ కార్యక్రమానికి అమరేందర్ సింగ్ రారు అని అందరూ భావించారు.కానీ అమరేందర్.

ఈ కార్యక్రమానికి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాడు.అంత మాత్రమే కాక సిద్దు ఏర్పాటుచేసిన తేనీటి విందులో కూడా పాల్గొన్నారు.

#Congress #Amarendhar Sing #Sidhu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు