ఎక్కడైనా హడావిడి వీరిదే.. ఆకట్టుకుంటున్న స్టార్ కపుల్!

ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ కపుల్ సందడి మాములుగా లేదు అనే చెప్పాలి.ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ స్టార్ జంట బిటౌన్ లో ఎక్కడ చూసిన అందరిని ఆకర్షిస్తూ హడావిడి చేస్తున్నారు.

 Sidharth Malhotra And Kiara Advani Cute Apperance Details, Nita Mukesh Ambani Cu-TeluguStop.com

ఏ వేదిక అయిన వీరి హడావిడి లేకుండా ముగియడం లేదు.మరి ఇంతగా ఆకట్టు కుంటున్న ఆ స్టార్ కపుల్ ఎవరా అని అంతా ఆలోచిస్తున్నారా.

ఆ జంట మరెవరో కాదు.

బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ(Kiara Advani) – సిద్ధార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra).

ఈ జంట అందరి కళ్ళకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఆకర్షణీయమైన డ్రెస్సింగ్ స్టైల్ తో మెప్పిస్తున్నారు.ఇటీవలే కియారా – సిద్ధార్థ్ ప్రేమించి రాజస్థాన్ లో పెద్దల సమక్షంలో ఫిబ్రవరి 7న గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాత వీరిద్దరూ ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ తో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటున్నారు.

ఇక ప్రెజెంట్ ఎవరి వృత్తిలో వారు బిజీగా ఉంటూనే ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నారు.ఇక తాజాగా ముంబైలో నీతా ముఖేష్ అంబానీ (Nita Mukesh Ambani) కల్చరర్ సెంటర్ (Nita Mukesh Ambani Cultural Centre Launch) ను ప్రారంభించిన సందర్భంగా ఈ ఈవెంట్ లో బాలీవుడ్ ప్రముఖులు సందడి చేసారు.మరి ఈ ఈవెంట్ లో కియారా – సిద్ధార్థ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

యూనిక్ డిజైనర్ వేర్ ధరించి ఈ జంట అందరితో బాగా కలిసి పోయి సందడి చేసింది.

ఇక ఈ ఈవెంట్ కు సంబంధించిన పిక్స్ కియారా షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉండగా ప్రస్తుతం కియారా తెలుగులో రామ్ చరణ్ సరసన గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తుంది.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఈమె మరో విజయాన్ని అందుకోవాలని ఎదురు చూస్తుంది.

అలాగే ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube