పిల్లలు టీవీ లేదా ఫోన్‌లు చూస్తూ తింటే చాలా ప్రమాదం.. ఏం జరుగుతుందో తెలిస్తే మీ పిల్లలకు అలా బోజనం పెట్టరు

ఈమద్య కాలంలో పిల్లలు చేతిలో ఫోన్‌ లేకుండా ఏ పని చేయడం లేదు.వారితో పోరు భరించలేక తల్లులు మరియు తండ్రులు వారికి ఫోన్‌లు చేతికి ఇవ్వడం, అందులో రైమ్స్‌ లేదా ఏదైనా పాటలు పెట్టివ్వడం చేస్తున్నారు.

 Side Effects Of Watching Tv And Mobile While Eating On Your Child1-TeluguStop.com

అలా చేయడం వల్ల వారు సైలెంట్‌గా ఒక మూలకు పోయి కూర్చుని ఉంటున్నారు.తినకుంటే ఫోన్‌ తీసుకుంటాను అంటే ఎంత పెడుతున్నారు, ఏం పెడుతున్నారు అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా తినేస్తున్నారు.

కొందరు ఫోన్‌కు బానిస అయితే మరి కొందరు టీవీకి బానిస అవుతున్నారు.ప్రతి ఒక్కరు కూడా అత్యంత దారుణమైన పరిస్థితులను ఇప్పుడు ఎదుర్కొంటున్నారు.

తాజాగా ఒక అద్యాయనంలో వెళ్లడి అయిన విషయం ప్రకారం కదలకుండా కూర్చిని తినడం వల్ల పిల్లలకు లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయట.పెద్దల విషయం పక్కన పెడితే అయిదు సంవత్సరాల లోపు పిల్లలు ఖచ్చితంగా తినేప్పుడు కాస్త అటు ఇటు తిరగడం లేదంటే అదో ఇదో పని చేయడం లేదా ఆడుకోవడం చేయాలట.

అలాంటప్పుడే వారి జీర్ణ వ్యవస్థ బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.డాక్టర్లు చెప్పిన ఈ విషయాలను తల్లిదండ్రులు తప్పకుండా పాటించాలి.

పిల్లలు ఫోన్‌లు లేకుండా తినడం లేదు, ప్రతి ఒక్కరి విషయంలో అలాగే జరుగుతుంది.అయితే వారిని ఆ అలవాటు మాన్పించడం కష్టం అంటున్నారు.

కాని ఆ అలవాటు మాన్నించడం అసాధ్యం మాత్రం కాదు.కాస్త ఓపిక చేసుకుని తల్లిదండ్రులు పిల్లల ఫోన్‌ మరియు టీవీ అలవాటును మార్పించవచ్చు.

ఈ విషయాన్ని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే పిల్లలకు ఇష్టమైన మరేదైన పనిని చేయడం వల్ల వారు ఫోన్‌ను పక్కకు పెట్టే అవకాశం ఉంది.

అలా పిల్లలను ఆడించేందుకు ప్రయత్నిస్తే తప్పకుండా వారు ఆ అలవాటుకు దూరం అవుతారని నిపుణులు చెబుతున్నారు.ఇప్పటికి అయినా పిల్లలను తినేప్పుడు వాటికి దూరంగా ఉంచి, తింటున్న సమయంలో అటు ఇటు పరిగెత్తేలా చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube