రూమ్ హీటర్స్ ను వాడుతున్నారా..? అయితే జాగ్రత్త సుమా..!

Side Effects Of Using Room Heaters

సాధారణంగా చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి కావున చలి ఎక్కువగా ఉంటుంది.ఈ చలి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం స్వెటర్లు, స్వెట్ షర్ట్స్‌ వాడుతూ ఉంటాము.

 Side Effects Of Using Room Heaters-TeluguStop.com

కానీ ఉష్ణోగ్రతలు బాగా పడిపోయే కొన్ని ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.అలాంటి ప్రదేశాల్లో నివసించేవారు చలిని తట్టుకోవడానికి రూమ్ హీటర్లను వాడతారు.

వీటిని గదిలో ఏర్పాటు చేసుకోవడం వలన హీటర్ల నుంచి వేడి అనేది గది చుట్టూ వ్యాపిస్తుంది.దీంతో చలి ప్రభావం లేకుండా, రూమ్ అనేది వెచ్చగా ఉండడం వలన హాయిగా నిద్రపోవచ్చు.

 Side Effects Of Using Room Heaters-రూమ్ హీటర్స్ ను వాడుతున్నారా.. అయితే జాగ్రత్త సుమా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఈ రూమ్ హీటర్లు వాడడం అనేది ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.మరి రూమ్ హీటర్ల వలన ఆరోగ్యానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసుకుందాం…

రూమ్ హీటర్‌ ను ఎక్కువగా ఉపయోగించేవారు, వాటిని వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనే అంశములపై అవగాహన పెంచుకోవాలి.

సాధారణంగా శీతాకాలంలో ఉండే పొడి వాతావరణం వల్ల గాలిలో తేమ తగ్గిపోతుంది.దీనికి తోడు గదిలో ఎక్కువసేపు హీటర్ వాడటం వల్ల తేమ మరింత తగ్గిపోతుంది.

అప్పుడు ఏర్పడే పొడి, వేడి గాలి చర్మాన్ని మరింత పొడిగా, గరుకుగా మారుస్తుంది.దీనివల్ల సున్నితమైన చర్మం ఉండేవారికి ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయి.

దీని వలన చర్మం ఎర్రబారటం, దురద వంటి సమస్యలకు దారితీస్తుంది.

అలాగే చాలామంది డబ్బులు తక్కువ అని అలోచించి చౌక ధరలకే రూమ్ హీటర్లు కొంటారు.కానీ, అది మంచి పద్ధతి కాదు.కొన్ని రకాల హీటర్లు ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ వాయువును విడుదల చేస్తాయి.

గదిలో వెంటిలేషన్ సరిగా లేకుండా, రాత్రంగా హీటర్‌ పెట్టుకొని పడుకోవడం వల్ల ఇది ప్రమాదకరమైన అనారోగ్యాలను కలుగజేస్తుంది.ఈ వాయువు పీల్చడం వలన ఇది ఉబ్బసం, అలర్జీలు, ఇతర తీవ్రమైన శ్వాస సంబంధ అనారోగ్యాలకు కారణమవుతాయి.

అందుకనే బ్రాండెడ్ కంపెనీ రూమ్ హీటర్లు కొనుకుంటే మంచిది.

హీటర్లు పెట్టుకొని గదిలో ఉన్నంతసేపు వెచ్చగా, సౌకర్యంగా ఉండవచ్చు.

కానీ బయటకు వెళ్లిన తరువాత చలి ప్రభావానికి గురైతే చర్మం తట్టుకోలేదు.ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తూ అనారోగ్యాలకు కారణమవుతుంది.

కావున ఎటువంటి వాతావరణ పరిస్థితులకు అయిన చర్మం తట్టుకునేలాగా ఉండాలి.అందుకనే హీటర్ల వల్ల గాలిలో తేమ తగ్గిపోవడంతో చర్మం పొడిబారటం, ముక్కు లేదా గొంతు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.

వీటికి దూరంగా ఉండాలంటే గదిలో ఏర్పడే పొడి గాలిలో తేమ స్థాయిని పెంచాలి.ఇందుకు ఈ పద్ధతి పాటించండి.

ఒక పెద్ద గిన్నెలో నీరు పోసి దాన్ని గదిలో పెట్టాలి.నిద్రపోయేటప్పుడు రూమ్ హీటర్‌ ను తప్పనిసరిగా ఆపేయాలి.

అలాగే హీటర్ టెంపరేచర్‌ తక్కువగా ఉండేలా సెట్ చేయాలి.మరో ముఖ్య విషయం ఏంటంటే హీటర్ ఉండే గదికి సరిపడా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.

#Heaters #Tips #Season #Care

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube