టమాటాలు.వీటి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.
చూడగానే ఎర్రగా నిగనిగలాడుతూ కనిపించే ఈ టమాటాలు రుచిలోనే కాదు.బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలోనూ అద్భుతంగా సహాయపడతాయి.
అయితే కొందరు టామాటా ఆరోగ్యానికి మంచిది కదా అని.దానికి బదులుగా టమాటా సాస్‌ను కావాల్సినంత లాగించేస్తుంటారు.బ్రెడ్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, సమోసా, మంచూరియా ఇలా రకరకాల పుడ్స్‌తో కలిసి టమాటా సాస్‌ను తీసుకుంటుంటారు.కానీ, ఇలా చేయడం చాలా పొరపాటు.
టమాటా సాస్‌ను అతిగా తీసుకుంటే.రిస్క్ పడటం ఖాయమంటున్నారు నిపుణులు.
ఎందుకూ అంటే.ఈ సాస్‌లో టమాటోల కంటే ఇతర రసాయనాలే అధికంగా ఉంటాయి.
వీటి వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా టమాటా సాస్‌ను ఓవర్‌గా తీసుకోవడం వల్ల.
హై బీపీ, మధుమేహం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అలాగే టమాటాలను సాస్‌గా మార్చడం వల్ల వాటిలో సహజంగా ఉండే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ నశించిపోతాయి.

కాబట్టి, టమాటాలకు బదులుగా టమాటా సాస్ తీసుకున్నా ఎలాంటి పోషకాలు శరీరానికి లభించవు.ఇక టమాటా సాస్ తయారీలో ఫుడ్ కలర్ ఎక్కువగా ఉపయోగిస్తారు.అందువల్ల టమాటా సాస్‌ను అతిగా తీసుకుంటే.ఎలర్జీ సమస్యలు వచ్చే రిస్క్ పెరుగుతుంది.టమాటా సాస్ రుచిగా ఉండేందుకు మరియు నిల్వ ఉండేందుకు రకరకాల ప్రమాదకరమైన కెమికల్స్ అందులో ఉపయోగిస్తారు.
వీటి వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, ఊబకాయం, ఆస్తమా మరియు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
కాబట్టి, ఎప్పుడూ కూడా ఆరోగ్యానికి మంచిది కదా అని భావించి టమాటాలకు బదులుగా టమాటా సాస్‌ను ఓవర్‌గా తీసుకోరాదు.ఈ టమాటా సాస్ రుచిగా ఉంటుందేమో.
కానీ, ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.