అద్భుతమైన ఆకుకూరల్లో బచ్చలికూర ఒకటి.ఈ ఆకుకూరలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషక విలువలెన్నో నిండి ఉంటాయి.
అందుకే ఆరోగ్య పరంగా బచ్చలి కూర బోలెడన్ని లాభాలను చేకూరుస్తుంది.అయితే హెల్త్‌కి ఎంత మంచి చేసినప్పటికీ బచ్చలి కూరను అతిగా తీసుకుంటే మాత్రం అనేక అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
అవును, బచ్చలి కూరతో లాభాలే కాదు.కొన్ని కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
మరి అవేంటో.? అసలు బచ్చలి కూరను ఓవర్‌గా తీసుకుంటే ఏం అవుతుందో.? ఇప్పుడు తెలుసుకుందాం.
బచ్చలి కూరను ఎడా పెడా తినడం వల్ల శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువగా ఫామ్ అయిపోతుంది.
దాంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.ఒకవేళ మీకు ఆల్రెడీ మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే గనుక బచ్చలికూర జోలికి వెళ్లక పోవడమే మంచిది.
అలాగే బచ్చలి కూరలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది.అందు వల్ల, ఈ ఆకుకూరను పరిమితికి మించి తీసుకుంటే తీవ్ర ఒత్తిడి పడి జీర్ణ వ్యవస్థ బలహీనంగా మారిపోతుంది.
ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
బచ్చలి కూరలో హిస్టమిన్ అనే రసాయనం ఉండే అవకాశం ఉంటుంది.ఈ రసాయనం శరీరంలోకి ఎక్కువ మోతాదులో వెళ్తే చర్మ అలర్జీలు తలెత్తుతాయి.అంతే కాదు, బచ్చలి కూరను ఓవర్‌గా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడతాయి.
శరీరం పోషకాలను గ్రహించే శక్తిని కోల్పోతుంది.మరియు రక్త పోటు స్థాయిలు సైతం భారీగా పడిపోతాయి.
కాబట్టి, ఇకపై హెల్త్‌కి మంచిదనే కారణంతో బచ్చలి కూరను అతిగా తిని లేని పోని సమస్యలను తెచ్చుకోకండి.