నట్స్‌లో ఒకటైన బాదం పప్పు కాస్త కాస్ట్రీ అయినప్పటికీ.ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.
అందుకే చాలా మంది ఉదయం పూట నాన బెట్టిన బాదం పప్పులు తింటుంటారు.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ బాదం పప్పును డైట్లో చేర్చుకోవచ్చు.
అయితే కొందరు చేసే పొరపాటు.ఎక్కువ ప్రయోజనాలు పొందాలని బాదం పప్పులను రోజుకు పది, పదిహేను లేదా అంతకంటే ఎక్కువగా తినేస్తుంటారు.
కానీ, ఏ ఆహారమైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది.
అలా కాకుండా.
అతిగా తీసుకునే అనేక అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇందుకు బాదం పప్పు ఏమి మినహాయింపు కాదు.
ఎన్నో పోషకాలు నిండి ఉన్న బాదం పప్పు అతిగా తింటే.అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ముఖ్యంగా బాదం పప్పును ఎక్కువగా తీసుకుంటే.శరీరంలో అదనపు కొవ్వు పెరుగిపోతోంది.
ఫలితంగా అధిక బరువు సమస్య బారిన పడాల్సి వస్తుంది.అలాగే మోతాదుకు మించి బాదం పప్పును తీసుకుంటే.
శరీరంలో విషతుల్యాలు పెరగడంతో పాటు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది.

ఇక కిడ్నీ సమస్యలు ఉన్న వారు బాదం పప్పులను అధికంగా తింటే.సమస్య మరింత తీవ్రంగా మారుతుంది.అందువల్ల, కిడ్నీ వ్యాధులు ఉన్న వారు బాదం పప్పుకు దూరంగా ఉండటమే మంచిది.
అంతేకాదు, బాదం పప్పు అతిగా తినడం వల్ల కడుపు నొప్పి, డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.కాబట్టి, బాదం పప్పులను రోజుకు కేవలం నాలుగు నుంచి ఏడు వరకే తీసుకోవాలి.

ఇలా లిమిట్‌గా బాదం పప్పు తినడం వల్ల గుండె జబ్బుల నుంచి రక్షణ, వెయిట్ లాస్, శరీర రోగ నిరోధక శక్తి పెరగడం, మధుమేహం ముప్పు తగ్గడం, చర్మ కాంతి రెట్టింపు అవ్వడం, శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందడం, ఎముకలు దృఢంగా మారడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి.