ఎన్నో ఔషధ గుణాలున్న తులసి ఆకులను చాలా అనారోగ్య సమస్యలకు మందుగా వాడుతుంటారు.కాన్సర్ రోజుకు రెండు మూడు ఆకులు నమిలితే క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు అని, నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే తులసి ఆకులను నమలడం వల్ల ఉపయోగం ఉంటుందని చెబుతూ ఉంటారు.
రోగనిరోధక శక్తిని పెంచడంలో తులసి బాగా ఉపయోగపడుతుంది.కానీ కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తులసి కారణమవుతుందని, తులసి ఆకులు తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి అన్న విషయం చాలా మందికి తెలియదు.
తులసి ఆకుల్లో పాదరసం ఉండడంవల్ల అవి నోట్లో వేసుకుని నమిలినప్పుడు అందులో ఉండే మూలకాలు బయటకు వస్తాయి.తులసి ఆకుల్లో ఆమ్లంగా ఉంటాయి.కాబట్టి., ప్రతి రోజూ నమలడం వల్ల అవి దంతాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి.
దీంతో పంటి ఎనామిల్ పై ప్రభావం పడుతుందని, దంతాల్లో సున్నితత్వం కూడా ఏర్పడుతుందని కాబట్టి అదే పనిగా తులసి ఆకులను తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
తులసిని సరైన మోతాదులో తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.తులసి ఆకులను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి.ఎన్సిబిఐ నివేదిక ప్రకారం తులసి ఆకుల్లో సంతానోత్పత్తి నిరోధక లక్షణాలు కలిగి ఉన్నాయట.
దీని వలన స్పెర్మ్ కౌంట్ తగ్గే ప్రమాదం ఉందట.ఒకవేళ తులసి ఆకులు ఎక్కువగా తింటే అది స్పెర్మ్ కౌంట్ ను ప్రభావితం చేస్తుంది.
గర్భిణులు పాలిచ్చే మహిళలు కూడా నిపుణుల సలహా మేరకు మాత్రమే తులసి ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది.ఆయుర్వేదం ప్రకారం తులసి ఆకుల్లో రక్తం గడ్డ కట్టే సమస్య ఉంది.రక్తం గడ్డ కట్టే సమస్య లేకుంటే బ్లడ్ తిన్నర్స్ తీసుకునేవారు తులసి ఆకులను ఎక్కువగా తీసుకోకూడదు.ఒకవేళ తీసుకుంటే రక్తం పల్చగా మారుతుంది.అలాగే తులసి ఆకును తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయని కూడా అధ్యయనాలు వెల్లడించాయి.అయితే డయాబెటిక్ మందులు వేసుకుని తీసుకుంటే శరీరంలో చక్కెర శాతం అధికంగా తగ్గి హానికరం అవ్వచ్చు.
మందులు వాడిన వారైతే ఒకసారి వైద్యులను సంప్రదించి ఆ తర్వాత తులసి ఆకులను ఔషధంగా తీసుకోవచ్చు.