మీరు స్పైసీ ఫుడ్ ను అధికంగా తింటారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

సాధారణంగా కొందరికి స్పైసీ ఫుడ్ అంటే మక్కువ ఎక్కువ.ఆ మక్కువతోనే ప్రతినిత్యం స్పైసీ ఫుడ్( Spicy food ) ను లాగించేస్తుంటారు.

ఎప్పుడో ఒకసారి స్పైసీ ఫుడ్ తింటే పెద్దగా సమస్యలు ఏమి ఉండవు.కానీ తరచూ స్పైసీ ఫుడ్ ను తినడం వల్ల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

స్పైసీ ఫుడ్స్‌ లో క్యాప్సైసిన్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం ఉంటుంది.ఇది మీ నోరు, అన్నవాహిక మరియు కడుపులో మంటను పుట్టిస్తుంది.

అదే స‌మ‌యంలో శరీరం లోపల అనేక దుష్ప్రభావాలను క‌లిగిస్తుంది.

Advertisement

త‌ర‌చూ స్పైసీ ఫుడ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ సమస్యలు ( Digestive problems )త‌లెత్తుతాయి.కారంగా ఉండే ఆహారం కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, గుండెల్లో మంట మరియు ఇతర జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.స్పైసీ ఫుడ్స్ నేరుగా పొట్టలో అల్సర్‌ను ప్రేరేపించవు.

కానీ ఒక వ్యక్తి ఇప్పటికే కడుపు పుండుతో బాధపడుతున్నట్లయితే.వారు మసాలా ఆహారాలను నివారించడం మంచిది.

లేదంటే అల్స‌ర్ స‌మ‌స్య మ‌రింత తీవ్ర‌త‌రంగా మారుతుంది.

అలాగే స్పైసీ ఫుడ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మీ శ‌రీర బ‌రువు అదుపు తప్పుతుంది.స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత తీపి తినాలనే కోరికలు పెరుగుతాయి.దాంతో స్కీట్స్ ను కూడా క‌డుపులోకి తోసేస్తుంటారు.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

ఇది క్ర‌మేణ వెయిట్ గెయిన్ కు దారి తీస్తుంది.స్పైసీ ఫుడ్ ను అధికంగా తినే వారు త‌ర‌చూ తీవ్ర‌మైన త‌ల‌నొప్పి( Headache )తో బాధ‌ప‌డుతుంటారు.

Advertisement

ఈ రకమైన తలనొప్పి బాధాకరమైనది మరియు అకస్మాత్తుగా వస్తుంది.స్పైసీ ఫుడ్ లో ఉండే క్యాప్సైసిన్ మీ చర్మంలో ఉష్ణ గ్రాహకాలను ప్రేరేపిస్తుంది.

అధిక చెమ‌ట‌ల‌కు కార‌ణమ‌వుతుంది.స్పైసీ ఫుడ్ మీ గొంతును చికాకు పెడుతుంది.

అంతేకాకుండా అధికంగా స్పైసీ ఫుడ్ ను తీసుకుంటే వికారం, వాంతులు, విరేచనాలు, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీ నొప్పి వంటి దుష్ప్రభావాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.కాబ‌ట్టి స్పైసీ ఫుడ్ ను ఎంత మితంగా తీసుకుంటే మీ ఆరోగ్యానికి అంత మంచిది.

తాజా వార్తలు