సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గలాట.. ఆ మాటలే కారణమట.. ??

తెలంగాణ కారు పార్టీలోని చాలా నియోజకవర్గాలలో వర్గ విభేదాలు ఎక్కువవుతున్నాయట.చిన్న జిల్లాలు ఏర్పాటు కావడం, ఒకరిద్దరిదే ఆధిపత్యం ఉండటంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య విభేదాలు వస్తున్నాయంటున్నారు.

 Siddipet Fight Between Trs And Bjp Leaders, Siddipet, Fight, Trs And Bjp, Leader-TeluguStop.com

ఇక యాలాల మండలంలో శుక్రవారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సమక్షంలోనే మాటల యుద్ధం కొనసాగింది.వరంగల్​ జిల్లాలో కూడా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య ఇలాంటి గొడవ జరిగింది.

ఇది మంత్రి కేటీఆర్​ దగ్గర కూడా చర్చగా మారింది.

ఇకపోతే కరీంనగర్​ కార్పొరేషన్​లో కూడా మేయర్​, కార్పొరేటర్ల మధ్య విభేదాలు వచ్చాయి.

అదీగాక మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలో ద్వితీయ స్థాయి నేతలు, సభ్యత్వ నమోదుకు దూరంగా ఉంటామని బహిరంగంగానే చెబుతున్నారు.అయితే తాజాగా సిద్దిపేట జిల్లాలో రైతు వేదిక భవనాల ప్రారంభోత్సవంలో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కాగా ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ దుబ్బాక మండలం చిట్టాపూర్ రామక్కపేట, ఆకారం దుబ్బాకలో నూతన రైతు వేదిక భవనాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ కొత్త రైతు చట్టాలపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ శ్రేణులు అభ్యంతరం తెలిపారు.

అంతే కాదు ఫారూక్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య కొద్దిసేపు ఉద్రిక్తతత నెలకొన్నది.

ఈ క్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు కూడా.అయితే పోలీసులు జోక్యం చేసుకోవడంతో నేతలు కాస్త చల్లబడ్డారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube