డీజే టిల్లు షూటింగ్ ప్రారంభం.. హీరోయిన్ మాత్రం దొరకట్లేదుగా?

టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహ శెట్టి జంటగా నటించిన చిత్రం డీజే టిల్లు.ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 12న విడుదల అయిన విషయం తెలిసిందే.

 Siddhu Jonnalagadda Dj Tillu 2 Shooting Starts And Pics Viral In Social Media, D-TeluguStop.com

కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.మొదట చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ గా నిలిచింది.

కాగా ఈ సినిమాలోని డైలాగులు పాటలు ఇప్పటికీ ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి.ఈ సినిమాలో టైటిల్ సాంగ్ అయినా డీజే టిల్లు సాంగ్ ఇప్పటికీ పెళ్లిళ్లలో పార్టీలలో ఎక్కడ చూసినా కూడా ఇదే పాట వినిపిస్తూ ఉంటుంది.

 Siddhu Jonnalagadda Dj Tillu 2 Shooting Starts And Pics Viral In Social Media, D-TeluguStop.com

ఈ సినిమా తర్వాత సిద్దు జొన్నలగడ్డ క్రేజ్ పూర్తిగా మారిపోయింది.హీరోయిన్ నేహా శెట్టి కీ కూడా భారీగా క్రేజ్ ఏర్పడింది.ఈ సినిమా ఎంతలా హిట్ అయింది అంటే సిద్దు జొన్నలగడ్డ అసలు పేరు మరిచిపోయి డీజే టిల్లు అని గుర్తుండిపోయేంతలా సినిమా ఆడియన్స్ కు నచ్చేసింది.ఇది ఇలా ఉంటే తాజాగా డీజే టిల్లు పార్ట్ 2 కీ సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది.

అదేమిటంటే డీజే టిల్లు పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది.తాజాగా చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేసింది.

Telugu Dj Tillu, Neha Shetty, Siddujonnala-Latest News - Telugu

డీజే టిల్లు పార్ట్ 2 షూటింగ్‌కు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే సిద్ధు జొన్నలగడ్డ పై కొన్ని సన్నీవేషాలను తెలుస్తోంది.నైట్ టైమ్‌లో షూటింగ్ షురూ చేశారు.అయితే ఈ సినిమాకు డైరెక్టర్‌ అలాగే హీరోయిన్ మారిపోయిన విషయం తెలిసిందే.విమల్‌ కృష్ణ స్థానంలో డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.డీజే టిల్లు పార్ట్ 2కు సంబంధించిన పిక్‌ను ఆయన షేర్ చేసుకున్నారు.

అలాగే నేహా శెట్టి ప్లేస్‌లో మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనుంది.అయితే హీరోయిన్ ఎవరు అన్నది ఇంతవరకు యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు.

కాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్ గా శ్రీలీలా ఫైనల్ అయిందంటూ వార్తలు జోరుగా వినిపించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని, ఆ తరువాత హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.అధికారికంగా ప్రకటించపోయినా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

మరి ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి మరి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube