నరుడి బ్రతుకు నటన అంటున్న సిద్దు జొన్నలగడ్డ

గుంటూరు టాకీస్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన నటుడు సిద్దు జొన్నలగడ్డ.ఆ సినిమా కంటే ముందుగా సిద్దు చాలా సినిమాలు చేసిన అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.

 Siddhu Jonalagadda's Ott Film Titled Narudi Brathuku Natana, Tollywood, Telugu C-TeluguStop.com

అయితే గుంటూరు టాకీస్ లో సిద్దు చేసిన పాత్ర అందరికి చేరువ అయ్యింది.ఆ సినిమా నటుడిగా అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

ఆ తరువాత మరో హిట్ మూవీ కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు.లాక్ డౌన్ టైంలో కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

సురేష్ ప్రొడక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.ఓటీటీలో రిలీజ్ అయినా ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులకి బాగా చేరువ అయ్యింది.

దీంతో అతనికి హీరోగా అవకాశాలు కూడా పెరిగాయి.అతనిలో టాలెంట్ చూసిన నిర్మాతలు లో బడ్జెట్ కథలతో సిద్దు హీరోగా సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారు.

ఈ నేపధ్యంలో సిద్దు హీరోగా మరో సినిమాకి సంబందించిన అప్డేట్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

చిన్న చిత్రాలతో పాటు, స్టార్ హీరోలతో వరుస సినిమాలు నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది.

నరుడి బ్రతుకు నటన టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటిస్తారు.ఈ చిత్రం ద్వారా విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోతో కూడిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.తన్మయత్వంలో వున్న ఓ ప్రేమజంట చెవులకు హెడ్ ఫోన్స్ తో ఈ ప్రచార చిత్రాన్ని కొత్తగా డిజైన్ చేశారు.

దీపావళి నుంచి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా కూడా కేవలం ఓటీటీ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube