7 ఏళ్ల గ్యాప్ తర్వాత డైరెక్ట్ మూవీ చేస్తున్న బొమ్మరిల్లు ‘సిద్దూ’  

Siddharth to make telugu comeback with Mahasamudram, Siddharth, RX 100, Mahasamudram, Ajay Bhupathi, Bommarillu, Nuvvu Vasthanante Nenodantana, Sharwanandh - Telugu \\'rx 100\\', Ajay Bhupathi, Bommarillu, Mahasamudram, Nuvvu Vasthanante Nenodantana, Sharwanandh, Siddharth

బాయ్స్ సినిమా తో లవర్ బాయ్ గా ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సిద్దార్ద్.బాయ్స్ తరువాత వరుసగా అతడు చేసిన సినిమాలు హిట్ టాక్ అందడం తో ఒక రేంజ్ లో లవర్ బాయ్ గా సెటిల్ అయిపోయాడు.

TeluguStop.com - Siddharth To Make Telugu Comeback With Mahasamudram

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ తదితర ఎన్నో చిత్రాల్లో నటించి ఎంతగానో మెప్పించాడు.బొమ్మరిల్లు చిత్రంలో సిద్దూ పాత్రలో సిద్దార్ధ్ ఎంతగా ప్రేక్షకులకు దగ్గర అయ్యాడో తెలిసిందే.

అయితే ఆ చిత్రం తరువాత తెలుగులో ఆయన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో… గత ఏడేళ్లుగా తెలుగు పరిశ్రమకు దూరంగా ఉన్నాడు.అయితే ఈ మధ్యలో అడపా దడపా కొన్ని తమిళ అనువాద చిత్రాల్లో కనిపించినా డైరెక్ట్ తెలుగు మూవీ లో మాత్రం నటించలేదు.ఈ క్రమంలో దాదాపు ఏడేళ్ల తర్వాత సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నాడు.‘మహాసముద్రం’ చిత్రంలో శర్వానంద్ తో పాటు సిద్ధార్థ్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాకు ఆర్ఎక్స్100ని తెరకెక్కించిన అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నాడు.

TeluguStop.com - 7 ఏళ్ల గ్యాప్ తర్వాత డైరెక్ట్ మూవీ చేస్తున్న బొమ్మరిల్లు సిద్దూ’-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.సుంకర రామబ్రహ్మం ఈ సినిమాను నిర్మిస్తుండగా, సిద్ధార్థ్ తమ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.

మొత్తానికి చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత సిద్దార్ద్ మరోసారి తెలుగు ప్రేక్షకులను నేరుగా అలరించనున్నాడు అన్నమాట.

#Mahasamudram #'RX 100' #Sharwanandh #Bommarillu #Siddharth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Siddharth To Make Telugu Comeback With Mahasamudram Related Telugu News,Photos/Pics,Images..