హీరోలని అజయ్ భూపతి అంత దారుణంగా తిడుతాడా.. ఎందుకు?

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహా సముద్రం’.లవ్ అండ్ యాక్షన్ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

 Siddharth Superb Speech At Maha Samudram Pre Release Event-TeluguStop.com

ఈ సినిమా అక్టోబర్ 14న విడుదలకానుంది.దీంతో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సిద్దార్థ్ ఈ విధంగా మాట్లాడారు.

‘మహాసముద్రం’.ఈ వేదిక కోసం నేను 9 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని ప్రముఖ హీరో సిద్దార్థ్ అన్నారు.

 Siddharth Superb Speech At Maha Samudram Pre Release Event-హీరోలని అజయ్ భూపతి అంత దారుణంగా తిడుతాడా.. ఎందుకు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంత మంది ప్రముఖులు, ప్రేక్షకుల ముందు నేను మళ్ళీ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నానంటే దానికి చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు.ఇక హీరోయిన్ అతిథి హైదరి గురించి మాట్లాడుతూ తను ఎంతో అద్భుతంగా నటించిందని తన నటనకు గాను డైరెక్టర్ అజయ్ భూపతి సెట్లో తనని, శర్వానంద్ ను తిడుతూ అదితినీ పొగిడే వాడని, ఈ వేదికపై తెలియజేశారు.

ఇకపోతే అన్నిటికీ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది.నా మహా సముద్రం ఫ్లాష్ బ్యాక్ మాత్రం జెమిని కిరణ్ నుంచే ప్రారంభం అయిందని నటుడు సిద్ధార్థ్ తెలిపారు.

ఈ సినిమాలో పని చేయడం చాలా వరకు క్రెడిట్ జెమిని కిరణ్ కు ఇస్తానని ఆయన అన్నారు.దానికి కిరణ్ గారికి చాలా థ్యాంక్స్ తనను, అజయ్ భూపతిని కలిపినందుకు అంటూ ఆయన వివరించారు.

Telugu Aditi Rao Hydari, Ajay Bhupathi, Gemini Kiran, Maha Samudram, Maha Samudram Pre Release Event, Producer Anil Sunkara, Siddharth, Tollywood-Movie

ఆ తర్వాత ప్రొడ్యూసర్ అనిల్ సుంకర.ఆయన చాలా డేరింగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్.మీరు ఒక అన్నయ్య స్థానంలో ఉండి నా క్యారక్టర్ గానీ, నా పార్టిసిపేషన్ గానీ, నా ఎమోషన్స్ గానీ, నా మెంటల్ ఫీలింగ్స్ గానీ చాలా బాగా పక్కనే ఉండి చూసుకున్నారు అని సిద్దార్థ్ అన్నారు.ఆయన లేకపోతే ఈ సినిమా లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఆయన లేకపోతే ఈ థియేటర్ లో విడుదల అనేది ఉండేది కాదు, మీరు ఉన్నారు కాబట్టి మళ్ళీ 2 ఏళ్ల తర్వాత థియేటర్స్ లో మా పేరు, మ ఫేసెస్ చూడపోబుతున్నాం అని ఆయన తెలిపారు.

Telugu Aditi Rao Hydari, Ajay Bhupathi, Gemini Kiran, Maha Samudram, Maha Samudram Pre Release Event, Producer Anil Sunkara, Siddharth, Tollywood-Movie

చిన్నప్పటి నుంచీ తనకు ఒక డ్రీమ్ ఉండేదన్న సిద్దార్థ్, ఒక పర్ఫెక్షన్ ఉంటే ఎలా ఉంటుంది.ఒక నచ్చిన పని చేయడానికి తనను పిలిచి, గౌరవించి, బాగా డబ్బులిచ్చి ఎవరైనా తన దగ్గర్నుంచి పని తీసుకుంటే అదే తన డ్రీమ్ గ చెప్తానని ఆయన వివరించారు.అలాంటి డ్రీమ్ ఈ సినిమాలో ప్రతీ రోజు రియాలిటీ అయిందని తాను ఫీల్ అయినట్టు ఆయన తెలిపారు.

#Maha Samudram #Gemini Kiran #Ajay Bhupathi #Anil Sunkara #Maha Samudram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు