కియారా ని పెళ్లి చేసుకోవడానికి ముందు సిద్ధార్థ మల్హోత్రా ఎంతమందితో లవ్వాయనం నడిపాడో తెలుసా ?

బాలీవుడ్ లో ఇటీవల ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం.అందరూ ఊహించినట్టుగానే ఇటీవలే మరొక ప్రేమ జంట పెళ్లితో ఒకటయ్యారు.

 Siddharth Malhotra Love Breakups Before Marriage, Siddharth Malhotra , Alia Bhat-TeluguStop.com

కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్రా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విషయం మనకు తెలిసిందే.అయితే సిద్ధార్థ మల్హోత్రా కియారా కన్నా ముందే చాలామందితో ప్రేమలో పడ్డాడు.మరి సిద్ధార్థ్ వ్యవహారం నడిపిన ఆ హీరోయిన్స్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆలియా భట్

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో తొలిసారిగా ఆలియా భట్ మరియు సిద్ధార్థ మల్హోత్రా ఒకేసారి సినిమా రంగానికి ఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమా సెట్లలో ఉండగానే వీరిద్దరూ ప్రేమలో పడినట్టు అప్పట్లో మీడియా కోడై కోసింది.అందుకు అనుగుణంగానే సిద్ధార్థ ఆలియా ఇద్దరు ముంబై లో అనేక మార్లు చెక్కర్లు కొడుతూ మీడియా కంట పడ్డారు. 2017లో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

Telugu Alia Bhatt, Bollywood, Kiara Advani, Tara Sutaria-Latest News - Telugu

జాక్వెలిన్ మరియు సిద్ధార్థ మల్హోత్రా చాలా రోజుల పాటు రిలేషన్ లో ఉన్నారు.ఏ జెంటిల్ మాన్ మరియు బ్రదర్స్ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ తమ రిలేషన్ షిప్ పై ఎప్పుడు ఓపెన్ గా కామెంట్ చేయలేదు కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ వీరు విడిపోయారు.

తార సుతారియా

Telugu Alia Bhatt, Bollywood, Kiara Advani, Tara Sutaria-Latest News - Telugu

మర్జవాన్ సినిమాలు కలిసి నటిస్తున్న సమయంలో సిద్ధార్థ మల్హోత్రా, తారతో ప్రేమలో పడ్డాడు.పడోసి వాలా లవ్ సినిమా సమయంలో వీరి రిలేషన్షిప్ పై తార మీడియాకు హింట్ ఇచ్చింది.కానీ త్వరగానే వీరిద్దరూ బ్రేకప్ బాట పట్టారు.సిద్ధార్థ తో బ్రేకప్ అయిన తర్వాత తార ఆదర్ జైన్ తో ప్రేమలో పడింది.

కియార అద్వానీ

Telugu Alia Bhatt, Bollywood, Kiara Advani, Tara Sutaria-Latest News - Telugu

తారా సుతారియా తో బ్రేకప్ అయిన తర్వాత సిద్ధార్థ షేర్షా సినిమా సమయంలో కియారాతో ప్రేమలో పడ్డాడు.తరచుగా మీడియాకి కావలసినంత మేటర్ ఇచ్చాక వీరిద్దరూ పెళ్లికి రెడీ అయ్యారు.పెళ్లికి ముందు నుంచే చాలా రోజులుగా సహజీవనం చేస్తున్న ఈ జంట కొన్ని రోజుల క్రితం మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube