మహాసముద్రంతో మళ్లొస్తానంటోన్న హీరో!  

Siddharth Bommarillu Mahasamudram 100 - Telugu Ajay Bhupathi, Bommarillu, Mahasamudram, Sharwanand, Siddharth

ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఓవర్‌నైట్ గుర్తింపు దక్కించుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి, ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ‘మహాసముద్రం’ కోసం రెడీ అవుతున్నాడు.ఇప్పటికే స్ర్కిప్టు పనులు పూర్తి చేసుకున్న ఈ డైరెక్టర్, తన సినిమాలో కావాల్సిన నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డాడు.

 Siddharth Bommarillu Mahasamudram 100

ఈ క్రమంలో ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉండనున్నట్లు అజయ్ భూపతి తెలిపాడు.కాగా ఈ సినిమాలో నటించేందుకు యంగ్ హీరో శర్వానంద్‌తో పాటు మరో హీరో సిద్ధార్థ్ కలిసి నటిస్తున్నారు.

అయితే శర్వానంద్ ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్నాడు.కాగా తన తాజా చిత్రం ‘శ్రీకారం’ను రెడీ చేస్తున్నాడు.అటు మరో హీరో సిద్ధార్థ్ గతకొంత కాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నాడు.తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సిద్ధార్థ్, ఈ సినిమాతో మంచి కమ్‌బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

మహాసముద్రంతో మళ్లొస్తానంటోన్న హీరో-Gossips-Telugu Tollywood Photo Image

గతంలో ఈ హీరో నటించిన బొమ్మరిల్లు సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే.ఇప్పుడు ఈ సినిమాతో మళ్లీ అలాంటి క్రేజ్‌ను దక్కించుకోవాలని చూస్తున్నాడు.

కాగా అజయ్ భూపతి రాసుకున్న కథ చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోల పాత్రలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని చిత్ర యూనిట్ అంటోంది.

ఇక హీరోయిన్‌గా ఇప్పటికే సాయిపల్లవిని ఎంపిక్ చేసిన చిత్ర యూనిట్, మరో హీరోయిన్‌ను సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు.మరి ఈ సినిమాతో శర్వానంద్‌కు సక్సెస్ దక్కుతుందా, సిద్దార్థ్‌కు మంచి కమ్‌బ్యాక్ లభిస్తుందా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Siddharth Bommarillu Mahasamudram 100 Related Telugu News,Photos/Pics,Images..

footer-test