సిద్ధార్థ్ బర్త్ డే గిఫ్ట్.. 'మహాసముద్రం' నుండి ఫస్ట్ లుక్ విడుదల..

బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు సిద్ధార్థ్.ఆ తర్వాత కూడా రెండు మూడు హిట్స్ తో బాగానే ఆకట్టుకున్నాడు.

 Siddharth Birthday Special Poster From Maha Samudram-TeluguStop.com

కానీ సిద్దార్థ్ చేస్తున్న సినిమాలు ఒక్కొక్కటిగా ప్లాప్ అవ్వడంతో ఆయన ఇమేజ్ పూర్తిగా తగ్గిపోయింది.దీంతో ఆయన తెలుగులో కనుమరుగై పోయాడు.

కొన్ని సంవత్సరాలుగా తెలుగులో డైరెక్ట్ సినిమా చేయడం లేదు.డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అప్పుడప్పుడు పలకరిస్తున్నారు.

 Siddharth Birthday Special Poster From Maha Samudram-సిద్ధార్థ్ బర్త్ డే గిఫ్ట్.. మహాసముద్రం’ నుండి ఫస్ట్ లుక్ విడుదల..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.ఆర్.

ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మహాసముద్రం సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో శర్వానంద్ కూడా ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్ అభిమానులను బాగానే ఆకట్టుకున్నాయి.

అయితే ఈ రోజు సిద్ధార్థ్ పుట్టిన రోజు సందర్భంగా మహాసముద్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.ఈ పోస్టర్ లో సిద్ధార్థ్ లవర్ బాయ్ లుక్ తో మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.ఒక పొడవైన క్యూలో నిలబడి ఎవరినో వెతుకుతున్నట్టు కనిపించాడు.

ఈ పోస్టర్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.ఈ సినిమాతో అయినా తెలుగులో మళ్ళీ మునపటి వైభవం తెచ్చుకోవాలని సిద్ధార్థ్ తాపత్రయ పడుతున్నాడు.

ఈ సినిమాను లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో అతిధి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఏకె ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ సినిమా ఆగస్టు 19 న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

#Siddharth #Anu Emmanuel #DirectorAjay #Sharwanand #BirthdaySpecial

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు