రవితేజ సినిమాలో బొమ్మరిల్లు స్టార్‌  

Siddharath Act With Ravi Teja Ajay Bhupati Movie-

మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం చేస్తున్న మూవీ పూర్తి అయిన వెంటనే ఆర్‌ఎక్స్‌ 100 చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయిన విషయం తెల్సిందే.ఆ చిత్రానికి మహాసముద్రం అనే టైటిల్‌ను కూడా ఖరారు చేయడం జరిగింది.దాదాపు సంవత్సర కాలంగా ఈ ప్రాజెక్ట్‌ గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.చివరకు హీరో కన్ఫర్మ్‌ అయిన తర్వాత కూడా మీడియాలో వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయి...

Siddharath Act With Ravi Teja Ajay Bhupati Movie--Siddharath Act With Ravi Teja Ajay Bhupati Movie-

తాజాగా మరో వార్త ఈ చిత్రం గురించి వచ్చింది.

Siddharath Act With Ravi Teja Ajay Bhupati Movie--Siddharath Act With Ravi Teja Ajay Bhupati Movie-

రవితేజ హీరోగా నటించబోతున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో తమిళ హీరో సిద్దార్థ్‌ కూడా నటించబోతున్నాడు.అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.అజయ్‌ భూపతి చెప్పిన కథకు సిద్దార్థ ఓకే చెప్పడంతో పాటు, రవితేజతో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడట.

తెలుగులో పలు సక్సెస్‌ చిత్రాలతో స్టార్‌ స్టేటస్‌ను ఒకప్పుడు అనుభవించిన సిద్దార్థ ఇప్పుడు మాత్రం సక్సెస్‌ లేక ఢీలా పడిపోయాడు.అలాంటి సిద్దార్థ ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు..

మాస్‌ ఇమేజ్‌ ఉన్న రవితేజ, క్లాస్‌ హీరో అంటూ పేరు దక్కించుకున్న సిద్దార్థలు ఇద్దరు కలిసి నటిస్తే సినిమా చాలా విభిన్నంగా ఉండటం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.అజయ్‌ భూపతి ఎంపిక చాలా విభిన్నంగా ఉందని, తప్పకుండా సినిమా ఆడుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్న రవితేజకు ఈ చిత్రం సక్సెస్‌ చాలా చాలా అవసరం.