కరోనాను జయించిన మాజీ ముఖ్యమంత్రి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి.ఈ సమయంలో మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది.

 Siddaramaiah Discharged From Hospital, Siddaramaiah, Corona Negative, Karnataka-TeluguStop.com

అయితే ఇక్కడ మనం ఆనందించాల్సిన విషయం ఏంటీ అంటే మన దేశంలో కరోనా రికవరీ రేటు చాలా ఎక్కువ ఉంది.అలాగే మృతుల రేటు చాలా తక్కువగా ఉంది.

కరోనా రికవరీ గురించి ఉన్న అనుమానాలు పటాపంచలు అవుతున్నాయి.గత నెల రోజులుగా దేశంలోని పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.వారిలో 99.9 శాతం మంది రివరీ అవుతున్నారు.తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య కూడా కరోనాను జయించారు.

ఈనెల 3వ తారీకున సిద్ద రామయ్య కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.

దాంతో ఆయన బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యి చికిత్స పొందరు.దాదాపు పది రోజుల తర్వాత ఆయన పూర్తిగా రికవరీ అయినట్లుగా వైధ్యులు ప్రకటించారు.

పెద్దగా సింటమ్స్‌ లేకుండానే సిద్దరామయ్య కరోనాను ఎదుర్కొని జయించారు.ఇటీవల ఆయనకు పరీక్ష నిర్వహించగా నెగటివ్‌ వచ్చింది.

దాంతో ఆయన్ను డిశ్చార్జ్‌ చేశారు.ఇటీవలే కర్ణాటక సీఎం యడ్యూరప్ప కరోనాను జయించిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం కన్నడ మంత్రి శ్రీరాములు కరోనాతో బాధపడుతున్నారు.ఈయన ఆరోగ్య శాఖ మంత్రి.

త్వరలో ఈయన కూడా కోలుకుంటారని ఆశిద్దాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube