న్యూయార్క్ రాష్ట్రంలో.. ఇండో అమెరికన్‌ సిబు నాయర్‌కు కీలక పదవి.. !!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ అన్ని రంగాల్లో రాణిస్తూ కీలక పదవులు చేజిక్కించుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా భారత సంతతికి చెందిన సిబు నాయర్‌‌కు కీలక పదవి దక్కింది.

 Sibu Nair Appointed Ny Dy Director For Asian American Affairs , Governor Kathy H-TeluguStop.com

ఆయనను న్యూయార్క్ రాష్ట్రానికి గాను ఆసియా అమెరికన్ వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్‌గా నియమిస్తూ గవర్నర్ క్యాథీ హోచుల్ ఆదేశాలు జారీ చేశారు.దీనిపై నాయర్ స్పందిస్తూ.

వ్యక్తిగతం ఇది తనకు, తన కుటుంబానికి, తన స్నేహితులకు , భారతీయ సమాజానికి దక్కిన గొప్ప గౌరవమని ఫేస్‌బుక్ పోస్ట్‌‌లో తెలిపారు.బఫెలో యూనివర్సిటీలో మెడిసిన్ డిపార్ట్‌మెంట్ క్లినికల్ ట్రయల్ అడ్మినిస్ట్రేటర్ అయిన సిబు నాయర్ భారత్‌లోనే పుట్టి పెరిగారు.

తాను న్యూయార్క్ తొలి గవర్నర్‌కు సేవ చేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఛాంబర్‌లోని అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు నాయర్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

న్యూయార్క్ రాష్ట్రంలో నివసిస్తున్న ఆసియా అమెరికన్లకు సేవ చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని సిబు నాయర్ హామీ ఇచ్చారు.

తనకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు, ఈ పదవిని చేపట్టగలనని తనపై నమ్మకం వుంచినందుకు గాను గవర్నర్ హోచుల్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఇండో అమెరికన్ సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు భారతదేశ కళలు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తానని నాయర్ అన్నారు.

ఆయన ప్రస్తుతం కౌన్సిల్ ఆఫ్ హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా (సీహెచ్ఏఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.గతంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఇండియా అసోసియేషన్‌ ఆఫ్ బఫెలోలో విధులు నిర్వర్తించారు.

Telugu Americanshekhar, Clinicaltrial, Councilheritage, Governorkathy, Sibu Nair

కాగా.అమెరికాలోని అతిపెద్ద నగరం, దేశ వాణిజ్య రాజధాని న్యూయార్క్ సిటీ కౌన్సిల్‌ ఎన్నికల్లో దక్షిణాసియా వ్యక్తులు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్ న్యాయవాది శేఖర్ కృష్ణన్, బంగ్లాదేశ్- అమెరికన్ షహానా హనీఫ్‌‌లు న్యూయార్క్ సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైన తొలి దక్షిణాసియా వాసులుగా రికార్డుల్లోకెక్కారు.అంతేకాదు ఈ ఎన్నికల్లో గెలిచిన తొలి ముస్లిం మహిళగా హనీఫ్ మరో అరుదైన గౌరవం పొందారు.

కేరళ నుంచి అమెరికాకు వలస వచ్చిన భారతీయులకు జన్మించారు కృష్ణన్.నగర కౌన్సిల్ ఎన్నికలలో జిల్లా 25లోని క్వీన్స్‌ జాక్సన్ హైట్స్, ఎల్మ్‌హర్ట్స్‌‌ల నుంచి ఆయన ఎన్నికయ్యారు.

తన రిపబ్లికన్ ప్రత్యర్ధి షా హక్‌ను కృష్ణన్ ఓడించారు.తనను నమ్మి ఓటు వేసినందుకు జాక్సన్ హైట్స్, ఎల్మ్‌హర్ట్స్‌కు శేఖర్ కృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube