సాధారణంగా ఏ రంగంలో అయినా పై స్థాయిలో ఉన్నవాళ్లు కింది స్థాయిలో ఉన్నవాళ్లను చిన్నచూపు చూడటం జరుగుతుంది.అయితే ఇలా వ్యవహరిస్తే ఫీల్ కావడం, హర్ట్ కావడం జరుగుతుంది.
అయితే చిన్నచూపు చూసిన వాళ్లు పై అధికారులు కావడం వల్ల ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.ఒకప్పుడు కానిస్టేబుల్ గా పని చేసి ఇప్పుడు ఎస్.ఐగా పని చేస్తున్న పలాస కాశీబుగ్గ ఎస్.ఐ శిరీష( SI Sirisha ) ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగారు.
విశాఖలోని రామా టాకీస్ ప్రాంతం మా స్వస్థలం అని తాను ఎం.ఫార్మసీ చదువుకున్నానని శిరీష చెప్పారు.తల్లి రమణమ్మ కూలీ పని చేస్తుందని తండ్రి అప్పారావు తాపీ పని చేస్తున్నారని శిరీష వెల్లడించారు.సోదరి వైద్య ఆరోగ్య శాఖలో అన్నయ్య ఇండియన్ నేవీలో పని చేస్తున్నారని శిరీష అన్నారు.
తాను 2014 సంవత్సరంలో మద్దిలపాలెంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా( Excise Constable ) ఎక్సైజ్ కంట్రోల్ రూమ్ లో పని చేశానని ఆమె చెప్పుకొచ్చారు.

తాను విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎస్పీ ఆఫ్ ట్రాల్ కానిస్టేబుల్ వి అని కామెంట్ చేశారని ఆ కామెంట్ వల్ల తాను నిద్రలేని రాత్రులు గడిపానని శిరీష వెల్లడించారు.ఆ మాట వల్ల తాను చాలా బాధ పడ్డానని ఆమె పేర్కొన్నారు.ఆ సమయంలో పరీక్షలకు సిద్ధమై ఎస్సై( SI ) కావాలని భావించానని ఆ సమయంలో మరో ఎస్పీ నన్ను ప్రోత్సహించారని శిరీష పేర్కొన్నారు.

నాకు 13 సంవత్సరాల వయస్సులోనే పెళ్లైందని పుస్తకాలు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులను చూశానని ఆమె చెప్పుకొచ్చారు.నాన్న నడిన బాటలో సేవంటే ఇష్టపడతానని శిరీష వెల్లడించారు.ఓ గుంతలో పడి ఉన్న 70 ఏళ్ల వృద్ధుని శవం మోశానని ఆమె చెప్పుకొచ్చారు.నా దృష్టిలో శివుడైనా శవమైనా ఒక్కటేనని శిరీష పేర్కొన్నారు.
ఆఫ్ ట్రాల్ కానిస్టేబుల్ అన్న వ్యక్తి తాను ఎస్సై అయిన తర్వాత తనకు సన్మానం చేశాడని ఆమె చెప్పుకొచ్చారు.