నాని సినిమా నుండి ప్రొడ్యూసర్ వాకౌట్..?  

Shyam Singha Roy Producer Walks Out Of Project, Nani, Shyam Singha Roy, Producer, Tollywood News, V Movie - Telugu Nani, Producer, Shyam Singha Roy, Tollywood News, V Movie

నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘వి’ కరోనా ప్రభావంతో ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టాలని చూసిన నాని, సినిమా రిజల్ట్‌తో అప్‌సెట్ అయ్యాడు.

TeluguStop.com - Shyam Singha Roy Producer Walks Out Of Project

ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను పట్టాలెక్కించే క్రమంలో బిజీగా మారాడు ఈ హీరో.ఇప్పటికే టక్ జగదీష్ అనే సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా, తన నెక్ట్స్ చిత్రాన్ని టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాకు ‘శ్యామ్ సింగ రాయ్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను పీరియాడికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

TeluguStop.com - నాని సినిమా నుండి ప్రొడ్యూసర్ వాకౌట్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమాకు ఆది నుండే అడ్డంకులు ఎదురవుతూ వస్తున్నాయి.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోల్‌కతాలో జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా హైదరాబాద్‌లో కోల్‌కతా సెట్‌లో జరుపుకోవాల్సి వస్తుంది.

అయితే తాజాగా ఈ సినిమా నుండి చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ వాకౌట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నట్లు ప్రకటించింది.

కానీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి నాగవంశీ వాకౌట్ చేసినట్లు, ఆయన స్థానంలో వెంకట్ బోయినపల్లి నిర్మాత బాధ్యతలు తీసుకున్నట్లు చిత్రపురిలో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇక ఈ సినిమాలో సాయి పల్లవితో పాటు మరో ఇద్దరు బ్యూటీలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

#Nani #Producer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shyam Singha Roy Producer Walks Out Of Project Related Telugu News,Photos/Pics,Images..