ప్రేమ పేరుతో నటిని మోసం చేసిన కేసులో టాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ అరెస్ట్...

చిత్ర పరిశ్రమలో ప్రేమలో పడటం మరియు విడిపోవటం వంటివి కామన్ గా జరుగుతుంటాయి.అయితే ఇందులో  కొంతమంది  ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలని అనుకుంటారు.

 Shyam K Naidu, Tollywood Photographer, Sai Sudha, Telgu Actress,  Cheating Case,-TeluguStop.com

మరికొంతమంది మాత్రం ప్రేమ పేరుతో తమ కోరికలను తీర్చుకొని వదిలించుకోవాలని చూస్తుంటారు.

అయితే తాజాగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ ఇటీవలే సినీ పరిశ్రమలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ గా పేరు పొందినటువంటి చోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్.

కె.నాయుడు తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం కూడా చేసి చివరికి పెళ్లి చేసుకోమ్మని అడిగితే ఇప్పుడు చేతులెత్తేసాడని కాబట్టి తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది.

దీంతో రంగంలోకి దిగిన టువంటి పోలీసులు తాజాగా శ్యామ్ కె నాయుడు ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణలో భాగంగా నటి సుధా శ్యామ్ కె నాయుడుపై చేసినటువంటి ఆరోపణలు నిజమేనని పోలీసులు తేల్చారు.

దీంతో శ్యామ్ కె నాయుడు పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దీంతో పలువురు నెటిజన్లు జీవిత భాగస్వామిని ఎన్నుకునే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటే జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుందని లేకపోతే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

కాగా సుధా టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేయడమే కాకుండా పలు మెసేజ్ ఓరియెంటెడ్ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube